Hyderabad: అవగాహనతోనే సైబర్ నేరాలకు అడ్డుకట్ట..
ABN, Publish Date - Aug 02 , 2025 | 07:57 AM
రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలకు అవగాహనతో అడ్డుకట్ట వేయవచ్చని హైదరాబాద్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్ తెలిపారు. సైబర్ నేరాలపై వెంటనే స్పందించడంతోపాటు, బాధితుల డబ్బును రికవరీ చేస్తున్నామన్నారు.
- సిటీ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్
- జూలైలో 289 సైబర్ మోసాలు
- 48 మంది అరెస్ట్..
- రూ.2.21 కోట్లు బాధితులకు రీఫండ్
హైదరాబాద్ సిటీ: రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాలకు అవగాహనతో అడ్డుకట్ట వేయవచ్చని హైదరాబాద్ అడిషనల్ సీపీ విశ్వప్రసాద్(Hyderabad Additional CP Vishwaprasad) తెలిపారు. సైబర్ నేరాలపై వెంటనే స్పందించడంతోపాటు, బాధితుల డబ్బును రికవరీ చేస్తున్నామన్నారు. బషీర్‌బాగ్ సైబర్ క్రైం కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అడిషల్ సీపీ విశ్వప్రసాద్, డీసీపీ కవిత మాట్లాడుతూ జూలై నెలలో నమోదైన సైబర్ నేరాల నివేదికను వెల్లడించారు.
నగర కమిషనరేట్ పరిధిలో ఎన్‌సీఆర్‌పీ ద్వారా 301 ఫిర్యాదులు రాగా, వాటిలో 289 ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. ఈ కేసుల విచారణలో భాగంగా ఏడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దేశంలో వివిధ ప్రాంతాల్లో దాగిఉన్న 48మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసినట్లు వివరించారు. ఈ నిందితులపై దేశ వ్యాప్తంగా 415 కేసులు నమోదయ్యాయని, వాటిలో 78 కేసులు తెలంగాణలో ఉన్నాయన్నారు.
నిందితుల నుంచి 89 మొబైల్స్, 56 చెక్‌బుక్‌లు, 94 డెబిట్ కార్డులు, 3 లాప్‌టా్‌పలు, 12 స్టాంపులు, 25 సిమ్‌కార్డులు, 39 బ్యాంకు పాస్‌బుక్‌లు, 2 ట్యాబ్‌లతోపాటు రూ. లక్ష నగదును స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కస్టమర్ కేర్, ఇన్‌వె్‌స్టమెంట్, క్రెడిట్‌కార్డు, ట్రేడింగ్, ఆన్‌లైన్, డిజిటల్ అరెస్ట్, సోషల్ మీడియా, ఇన్సూరెన్స్ పాలసీ, జాబ్, లోన్‌ఫ్రాడ్, ఓటీపీ వంటి 32 కేసులకు సంబంధించి రూ.2.21,70,130 నగదు ఫ్రీజ్ చేసి బాధితులకు అప్పగించామని తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయోచ్.. ఎంతకు చేరాయంటే
సైబర్ నేరగాళ్ల సరికొత్త ఎత్తులు!
Read Latest Telangana News and National News
Updated Date - Aug 02 , 2025 | 08:04 AM