ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CV Anand: సీపీ హెచ్చరిక.. వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు..

ABN, Publish Date - May 30 , 2025 | 02:14 PM

నేపాల్‌ దొంగలు, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ముఠా కోసం వేట కొనసాగుతుందని, వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆ దొంగల ముఠా కోసం పోలీసులు గాలిస్తున్నారని, తొందర్లోనే ఆ ముఠాను పట్టుకుంటామని సీపీ తెలిపారు.

- నేపాల్‌ దొంగలు, అఫ్జల్‌గంజ్‌ కాల్పుల ముఠా కోసం కొనసాగుతున్న వేట

- దేశంలోనే దాక్కున్నారు

- సీపీ సీవీ ఆనంద్‌

హైదరాబాద్‌ సిటీ: ఇటీవల రెండు ఘరానా దొంగల ముఠాలను పట్టుకోవడంలో ఆలస్యం అయ్యిందని, కాని కచ్చితంగా పట్టుకుంటామని సిటీ పోలీస్‌ కమిషనర్‌ సీవీ ఆనంద్‌(CV Anand) పేర్కొన్నారు. గురువారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘‘కాచిగూడ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఓ పారిశ్రామిక వేత్త ఇంట్లో భారీ చోరీకి పాల్పడి సుమారు రూ. 5 కోట్లతో ఉడాయించిన నేపాల్‌ దొంగల ముఠాను, అఫ్జల్‌గంజ్‌లో కాల్పులకు పాల్పడిన ఘరానా అంతర్రాష్ట్ర దోపిడీ దొంగల ముఠాను కచ్చితంగా పట్టుకొని తీరుతామన్నారు. అక్కడ వారి చిరునామాల్లో గాలించగా వారు ఇండియా దాటి నేపాల్‌కు వెళ్లలేదని తేలిందని తెలిపారు.


ఇండియాలోనే తలదాచుకున్నారని అనుమానిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియా నేపాల్‌ బార్డర్‌లో లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేశామని తెలిపారు. దొంగల ఆచూకీ తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఈస్టుజోన్‌ డీసీపీ : 8712660501, అడిషనల్‌ డీసీపీ : 8712660503, ఏసీపీ : 8712660506/09, కాచిగూడ ఎస్‌హెచ్‌వో: 8712660540, డీఐ: 8712660541. నంబర్‌లకు తెలియజేయాల్సిందిగా పేర్కొన్నారు. రెండు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో కాల్పులకు తెగబడిన దోపిడీ దొంగలను పట్టుకోవడంలోనూ ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టమన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Gold Rates In India on May 30: నేడూ స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు

Fee Reimbursement: ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్‌కు 75 శాతం హాజ‌రు తప్పనిసరి

Read Latest Telangana News and National News

Updated Date - May 30 , 2025 | 02:14 PM