ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: ప్రభాకర్‌రావుకు ముందస్తు బెయిల్‌ ఇవ్వొద్దు

ABN, Publish Date - Apr 08 , 2025 | 05:05 AM

ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి. ప్రభాకర్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది.

  • హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం వాదన

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ఆంధ్రజ్యోతి): ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడు, ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ టి. ప్రభాకర్‌రావుకు ఎట్టిపరిస్థితుల్లో ముందస్తు బెయిల్‌ ఇవ్వరాదని రాష్ట్ర ప్రభుత్వం సోమవారం హైకోర్టుకు విజ్ఞప్తి చేసింది. ప్రధాన నిందితుడైనప్పటికీ ప్రభాకర్‌రావు దేశం విడిచి పారిపోయారని తెలిపింది. ఇతర నిందితులకు బెయిల్‌ వచ్చింది కాబట్టి తనకూ ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతున్నారని గుర్తు చేసింది.


దేశం విడిచి పారిపోయిన నిందితుడికి ముందస్తు బెయిల్‌ ఇస్తే సమాజంలో తప్పుడు సంకేతాలు వెళ్తాయని తెలిపింది. అమెరికా ప్రభుత్వం తనను అప్పగిస్తుందని పసిగట్టి ముందస్తు బెయిల్‌ కోసం ఈ కోర్టును ఆశ్రయించారని పేర్కొంది. వాదనలు విన్న జస్టిస్‌ జే శ్రీనివాసరావు ధర్మాసనం.. తదుపరి విచారణను ఈనెల 15కు వాయిదా వేసింది.

Updated Date - Apr 08 , 2025 | 05:05 AM