ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

High Court: అనుమతుల్లేని భవనాలను సీజ్‌ చేయండి

ABN, Publish Date - May 04 , 2025 | 04:17 AM

హైకోర్టు ఆదేశాలతో అనుమతుల్లేని భవనాలను సీజ్‌ చేయాలని జీహెచ్‌ఎంసీకి సూచనలు జారీ అయ్యాయి. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోవడం వల్లే పిటిషన్ల పెరుగుదల జరిగిందని ధర్మాసనం వ్యాఖ్యానించింది

  • అధికారులకు సర్క్యులర్‌ పంపండి: హైకోర్టు

హైదరాబాద్‌, మే 3 (ఆంధ్రజ్యోతి): అనుమతులు లేకుండా, ప్రణాళికకు విరుద్ధంగా చేపట్టిన భవనాలను, అంతస్తులకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి సీజ్‌ చేయాలని హైకోర్టు ఆదేశించింది. ఈ విషయాన్ని తెలుపుతూ డిప్యూటీ కమిషనర్లు, టౌన్‌ప్లానింగ్‌ అధికారులకు సర్క్యులర్‌ జారీచేయాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌కు సూచించింది. షేక్‌పేట్‌ ఓయూ కాలనీలో అనుమతి లేకుండా జీ+4, పెంట్‌హౌజ్‌ నిర్మిస్తున్నారని.. దీనిపై ఫిర్యాదుచేసినా పట్టించుకోడం లేదని పేర్కొంటూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. దీనిపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం.. జీహెచ్‌ఎంసీ అధికారులు అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. అందువల్లనే హైకోర్టులో ఎక్కవ సంఖ్యలో పిటిషన్‌లు దాఖలవుతున్నాయని పేర్కొంది.

Updated Date - May 04 , 2025 | 04:17 AM