ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Health Scheme: నిమ్స్‌ వైద్యులకు ఆరోగ్యశ్రీ ప్రోత్సాహకం

ABN, Publish Date - May 10 , 2025 | 04:51 AM

ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అందించినందుకు, నిమ్స్‌కు ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే డబ్బులో 35 శాతం ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి అందించేందుకు ముందడుగు పడింది.

  • కొత్తగా 800 పోస్టుల భర్తీకి అనుమతి

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్యశ్రీ రోగులకు చికిత్స అందించినందుకు, నిమ్స్‌కు ఆరోగ్యశ్రీ నుంచి వచ్చే డబ్బులో 35 శాతం ఇకపై డాక్టర్లకు, వైద్య సిబ్బందికి అందించేందుకు ముందడుగు పడింది. సచివాలయంలో శుక్రవారం జరిగిన నిమ్స్‌ ఎగ్జిక్యూటివ్‌ బోర్డు మీటింగ్‌లో సంబంధిత ప్రతిపాదనకు మంత్రి దామోదర రాజనర్సింహ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన నిమ్స్‌ డైరెక్టర్‌ బీరప్ప.. గత ఏడాది నిమ్స్‌లో ఆరోగ్య శ్రీ కింద రోగులకు అందించిన సేవల వివరాలతో కూడిన నివేదికను అందజేశారు.


పెరుగుతున్న రోగులకు సంఖ్యకు అనుగుణంగా డాక్టర్లు, సిబ్బంది భర్తీకి అనుమతించాలని కోరారు. అనంతరం మంత్రి దామోదర మాట్లాడుతూ నిమ్స్‌లో 800పైగా పోస్టుల భర్తీకి అనుమతి ఇస్తున్నట్లు ప్రకటించారు. కొత్త భవనాల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని, నాణ్యతలో రాజీపడొద్దని సూచించారు.

Updated Date - May 10 , 2025 | 04:51 AM