ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Harish Rao: సీఎం రేవంత్‌ నోరు విప్పితే అబద్ధాలే

ABN, Publish Date - May 24 , 2025 | 03:33 AM

సీఎం రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతారు. కాళేశ్వరం కూలింది అంటారు.. అది కూలితే విఠలాపూర్‌ గ్రామంలో అనంతమ్మ కుంట ఎట్లా నిండింది.

  • కాళేశ్వరం కూలితే పంటలు ఎలా పండాయి?: హరీశ్‌రావు

చిన్నకోడూరు/హైదరాబాద్‌, మే 23 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం రేవంత్‌రెడ్డి నోరు విప్పితే అబద్ధాలే మాట్లాడుతారు. కాళేశ్వరం కూలింది అంటారు.. అది కూలితే విఠలాపూర్‌ గ్రామంలో అనంతమ్మ కుంట ఎట్లా నిండింది. యాసంగికి చిన్నకోడూరు మండలంలో పంటలు ఎలా పండాయి’’ అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం విఠలాపూర్‌లో ముదిరాజ్‌ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మతల్లి ఆలయ వార్షికోత్సవాలకు హాజరైన ఆయన మాట్లాడారు.


రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చి యేడాదిన్నరైనా ఇచ్చిన హామీలను అమలు చేయడంలేదని, మహిళలకు రూ.2,500, రూ.4 వేలు పెన్షన్‌ ఇవ్వడం లేదని మండిపడ్డారు. మాజీ సీఎం కేసీఆర్‌ కృషి వల్లే సాగు నీటికి ఇబ్బంది లేకుండా ఉందని చెప్పారు. కాగా, జహీరాబాద్‌కు సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నారని.. అక్కడి పరిసర ప్రాంతాల రైతులను ముందస్తుగా అరెస్టు చేస్తారా? ఇదేం పద్ధతి అని హరీశ్‌ రావు ఎక్స్‌ వేదికగా ప్రశ్నించారు.

Updated Date - May 24 , 2025 | 03:33 AM