ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Haragopal: చంపుతామని ప్రభుత్వమే ప్రకటించడం అమానవీయం..

ABN, Publish Date - Jul 02 , 2025 | 08:00 AM

ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వక్తలు డిమాండ్‌ చేశారు.

- ఆచార్య హరగోపాల్‌

హైదరాబాద్‌ సిటీ: ప్రభుత్వం వెంటనే కాల్పుల విరమణ ప్రకటించాలి. మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని వక్తలు డిమాండ్‌ చేశారు. బదనకల్‌ అమరుల 20వ వర్ధంతి సందర్భంగా మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సంస్మరణ సభ జరిగింది. ఈ సందర్భంగా అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య రూపొందించిన శాంతమ్మ సమర గాథ పాటలను అమరుడు రాజు తల్లి పెద్ది పిచ్చమ్మ ఆవిష్కరించారు. అనంతం ఆచార్య హరగోపాల్‌ మాట్లాడుతూ.. స్వార్థంతో బతకండి అని వ్యక్తిత్వ వికాసం పేరుతో పుస్తకాలు కూడా వస్తున్నాయి అని ఆందోళన వ్యక్తం చేశారు.

నిస్వార్థ పరులను బలహీనులుగా చూసే పరిస్థితులు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఫలానా తేదీలోపు మావోయిస్టు పార్టీని లేకుండా చేస్తామని గడువు పెట్టి మరీ ప్రకటించడం అన్యాయమని విమర్శించారు. ఒక సిద్థాంతాన్ని విశ్వసించి, సమ సమాజ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్న మావోయిస్టులను చంపి పోలీసులు ఆనందంతో నృత్యం చేయడం అమానుషమని దుయ్యబట్టారు.

ఉమ్మడి ఏపీ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమార్‌(Chandrakumar) మాట్లాడుతూ.. 2026, మార్చి31 నాటికి మావోయిస్టులను లేకుండా చేస్తామని కాదు, ఈ దేశంలో నిరుద్యోగాన్ని, అవినీతిని నిర్మూలిస్తామని ప్రకటించండి అని సవాల్‌ విసిరారు. డ్రగ్స్‌ రహిత సమాజాన్ని నిర్మిస్తామని ప్రకటించండి. గడువు పెట్టాల్సింది మంచి కోసమే గానీ మనుషులను చంపటానికి కాదని అన్నారు. మానవ హక్కుల వేదిక జాతీయ కన్వీనర్‌ జీవనకుమార్‌ మాట్లాడుతూ 1969లో బూటకపు ఎన్‌ కౌంటర్‌ హత్యలు మొదలయ్యాయని ప్రస్తావించారు. ఇప్పటి వరకు 4,200 మంది ఎన్‌ కౌంటర్‌లో చనిపోయినట్లు తెలిపారు.

ఆపరేషన్‌ కగార్‌ను వెంటనే నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌కౌంటర్‌ పేరుతో చంపి, వారి భౌతిక కాయాలను కుటుంబ సభ్యులకు ఇవ్వకపోవడం అత్యంత దుర్మార్గమని విమర్శించారు. మావోయిస్టులు కూడా ఇన్ఫార్మర్ల పేరుతో అమాయకులను చంపే ప్రయత్నం మానుకోవాలని జీవన్‌కుమార్‌ అన్నారు. కార్యక్రమంలో ఆచార్య భగవంత్‌ రెడ్డి, ప్రజా గాయని విమలక్క తదితరులు పాల్గొన్నారు.

ఈ వార్తలు కూడా చదవండి.

విద్యార్థుల హెల్త్‌ ప్రొఫైల్‌ రూపొందించాలి

అధికారులు ఉత్సాహంగా పనిచేయాలి

Read Latest Telangana News and National News

Updated Date - Jul 02 , 2025 | 08:00 AM