ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Tribal Food Court: గిరిజన విందు

ABN, Publish Date - May 20 , 2025 | 03:49 AM

గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు/ తృణ ధాన్యాలు.. కల్తీకి తావులేని సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులతో తయారుచేసిన చిరుతిళ్లు, వంటకాలను రాష్ట్ర ప్రజలందరికి రుచి చూపేందుకు సర్కారు సిద్ధమైంది.

  • మాసాబ్‌ట్యాంక్‌ తెలుగు సంక్షేమ భవన్‌లో ట్రైబల్‌ కెఫెటేరియా

  • ఇప్ప లడ్లు, గారెలు, చపాతీలు సహా చిరుతిళ్లు

  • తృణ, చిరుధాన్యాల ఉత్పత్తులతో వంటకాలు

  • అక్కడే కొలువుదీరిన 11 జాతుల గిరిజన ఆలయాలు

  • త్వరలో ప్రారంభం

హైదరాబాద్‌, మే 19 (ఆంధ్రజ్యోతి): గిరిజనులు, అటవీ ప్రాంత వాసులకే పరిమితమైన చిరు/ తృణ ధాన్యాలు.. కల్తీకి తావులేని సహజ సిద్ధమైన అటవీ ఉత్పత్తులతో తయారుచేసిన చిరుతిళ్లు, వంటకాలను రాష్ట్ర ప్రజలందరికి రుచి చూపేందుకు సర్కారు సిద్ధమైంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో గిరిజనుల అభివృద్ధికి కృషి చేస్తున్న ఉట్నూరు, ఆదిలాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, ఏటూరు నాగారం ఐటీడీఏలు.. ప్రతి ఒక్కరికీ నోరూరించే స్వీట్లు, గారెలు తదితర చిరు తిళ్లు, ఇతర ఇతర వంటకాల తయారీ చేయిస్తూ.. అటవీ ప్రాంత వాసులకు స్వయం ఉపాధి కల్పిస్తున్నాయి.


స్వీట్లతోపాటు 20 రకాల పిండి వంటలు

ఉట్నూరు ఐటీడీఏ పరిధిలో యూనిట్లలో ఇప్పపువ్వుతో కూడిన స్వీటు, ఇప్ప లడ్డూ, ఇప్ప గారెలు, చపాతీలతోపాటు సుమారు 20 రకాల పిండి వంటలు, చిరు తిళ్లు తయారు చేస్తున్నారు. ఇక భద్రాచలం, ఆదిలాబాద్‌, ఏటూరునాగారం ఐటీడీఏ యూనిట్లలో చిరు, తృణ ధాన్యాలతో తయారు చేస్తున్న పలు చిరు తిళ్లలో ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు, మాంస కృత్తులన్నీ సమపాళ్లలో ఉంటాయి. అటవీ ఉత్పత్తులతో తయారుచేస్తున్న వంటకాల్లో కల్తీకి ఆస్కారం లేకపోవడంతో అవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అధికారులు చెబుతున్నారు. వీటి ధరలు కూడా అందరికీ అందుబాటులోనే ఉంటాయని అధికార వర్గాల ద్వారా తెలిసింది. అటవీ ఉత్పత్తులతో తయారుచేసిన చిరుతిళ్లు, ఇతర వంటకాలను ప్రజలందరికీ పరిచయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం.. హైదరాబాద్‌లోని మాసాబ్‌ ట్యాంక్‌ వద్ద గల తెలుగు సంక్షేమ భవన్‌లో గిరిజన మ్యూజియం ముందు ‘గిరిజన ఆహారశాల పేరుతో ఓ స్టాల్‌ ఏర్పాటు చేస్తోంది.


ఇది పూర్తిగా చెక్కలు, కొయ్యలతోనే పూర్తిగా రూపుదిద్దుకుంటున్నది. ఇక్కడ కూర్చుని తినడానికి ప్రత్యేకంగా పైకప్పుతో కూడిన ఓ టేబుల్‌ ఆకర్షణీయంగా చూపరులను ఆకట్టుకుంటోంది. సిమెంట్‌ లేకుండా ఎర్రమట్టితో అలికిన ఆహారశాల చాలా సహజ సిద్ధంగా ఉంటుంది. గిరిజన ఆహారశాలతోపాటు అక్కడే అధికారికంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే 11 గిరిజన జాతుల చరిత్ర, వారి సంప్రదాయ ఆచారాలను ప్రజలకు తెలియజెప్పేందుకు ఆలయాలు నిర్మిస్తున్నారు. లంబాడీ (సంత్‌ సేవాలాల్‌), ఎరుకల, కొండరెడ్డి, చెంచు, తోటి, కొలాం, కోయ, నాయక్‌పోడు, పర్ధాన్‌, గోండ్‌, అంధ్‌ జాతుల జాతరలను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ 11 గిరిజన జాతుల జాతరలు, వారి సంప్రదాయ సంస్కృతులనూ ప్రజలకు తెలిపేలా ‘గిరిజన దేవాలయాలు’ అనే పేరుతో 11 నిర్మాణాలు చేపట్టారు. ఈ నిర్మాణాల ఎదురు గోడలపై వారి సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే చిత్రాలు వేశారు. సుమారు రూ.5-7 లక్షల ఖర్చుతో నిర్మించి గిరిజన ఆహారశాల, దేవాలయాలను త్వరలో ప్రారంభించనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్‌ కనెక్షన్లు.!

Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు

Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 20 , 2025 | 03:49 AM