ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

సమాచార కమిషనర్లుగా ముగ్గురి నియామకానికి గ్రీన్‌సిగ్నల్‌

ABN, Publish Date - May 11 , 2025 | 06:05 AM

సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడుగురిలో ముగ్గురి నియామకానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదం తెలిపినట్లు తెలిసింది.

  • మరో నలుగురి పేర్లపై గవర్నర్‌ అభ్యంతరం

హైదరాబాద్‌, మే 10 (ఆంధ్రజ్యోతి): సమాచార హక్కు చట్టం కమిషనర్లుగా ప్రభుత్వం ప్రతిపాదించిన ఏడుగురిలో ముగ్గురి నియామకానికి గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. వికారాబాద్‌ జిల్లాలోని కొడంగల్‌కు చెందిన న్యాయవాది, ప్రముఖ జర్నలిస్టుతోపాటు మైనార్టీ సామాజిక వర్గానికి చెందిన మహిళను సమాచార కమిషనర్లుగా నియమించడానికి అంగీకారం తెలిపినట్లు ప్రచారం జరుగుతోంది.


మరోవైపు.. కోదాడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి, అధికారపార్టీలో క్రియాశీలకంగా పని చేసిన ఇద్దరితోపాటు మరో మహిళ పేరును గవర్నర్‌ తిరస్కరించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌ అభ్యంతరాలను నివృత్తి చేసే పనిలో ప్రభుత్వం ఉన్నట్లు తె లుస్తోంది. గవర్నర్‌ ఆమోదం పొందిన ముగ్గురి నియామకానికి సంబంధించి సోమవారం ఉత్తర్వులు వెలువడనున్నాయని సమాచారం.

Updated Date - May 11 , 2025 | 06:05 AM