G. Kishan Reddy: డీఎంఎఫ్‌ను మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లండి
ABN, Publish Date - Jul 10 , 2025 | 04:24 AM
డిస్ర్టిక్ట్ మినరల్ ఫౌండేషన్(డీఎంఎ్‌ఫ)ను ఆయా జిల్లాల కలెక్టర్లు మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు.
మైనింగ్ ప్రాంతాల్లోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపండి
యాస్పిరేషనల్ జిల్లాల కలెక్టర్ల వద్ద రూ.32 వేల కోట్ల నిధులు
డీఎంఎఫ్ వర్క్‌షా్‌పలో కిషన్ రెడ్డి
న్యూఢిల్లీ, జూలై 9 (ఆంధ్రజ్యోతి): డిస్ర్టిక్ట్ మినరల్ ఫౌండేషన్(డీఎంఎ్‌ఫ)ను ఆయా జిల్లాల కలెక్టర్లు మిషన్ మోడ్‌లో ముందుకు తీసుకెళ్లాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి సూచించారు. యాస్పిరేషనల్ జిల్లాల అభివృద్ధి కోసం కలెక్టర్ల వద్ద రూ.32 వేల కోట్లున్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుని మైనింగ్ ప్రాంతాల్లోని ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. బుధవారం ఢిల్లీలో జరిగిన డీఎంఎఫ్ వర్క్‌షా్‌పలో కిషన్ రెడ్డి మాట్లాడారు. దేశవ్యాప్తంగా 646 డీఎంఎ్‌ఫలుండగా.. వాటిలో సుమారు రూ.లక్ష కోట్లు జమ చేశామని, దాదాపు రూ.90 వేల కోట్లు అభివృద్ధి పనుల కోసం మంజూరు చేశామని తెలిపారు. యాస్పిరేషనల్ జిల్లాల కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన ‘యాస్పిరేషనల్ డీఎంఎఫ్ ప్రోగ్రాం’లో భాగంగా ఆరోగ్యం, పోషకాహారం, విద్య, వ్యవసాయం, మౌలిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యమిచ్చామన్నారు. ప్రస్తుతం దేశంలోని 112 యాస్పిరేషనల్ జిల్లాల్లో 106 డీఎంఎఫ్ యాస్పిరేషనల్ జిల్లాలున్నాయని తెలిపారు. ఆయా జిల్లాల కలెక్టర్ల వద్ద ఉన్న రూ.32 వేల కోట్ల నిధుల సద్వినియోగానికి ప్రణాళికలు రూపొందించాలని, ఇందులో స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజల సలహాలు, సూచనలు తీసుకోవాలని సూచించారు.
డీఎంఎఫ్‌తోపాటు సీఎ్‌సఆర్, ప్రభుత్వ పథకాలు, మైన్ మూసివేతకు సంబంధించిన కార్యక్రమాలను ఒకే వేదికపైకి తీసుకురావాలని చెప్పారు. డీఎంఎఫ్ ఎగ్జిబిషన్లలో స్వయం సహాయక సంఘాలు, మహిళలు, యువతను భాగస్వామ్యం చేయాలన్నారు. దేశంలో 70శాతం విద్యుత్ బొగ్గు ద్వారానే ఉత్పత్తి అవుతోందని, తద్వారా రాయల్టీగా వచ్చే నిధులను డీఎంఎఫ్ ద్వారా స్థానిక ప్రజల సంక్షేమానికి వినియోగించాలని సూచించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా అన్ని రాష్ట్రాల్లో డీఎంఎఫ్ ద్వారా విస్తృతంగా కార్యక్రమాలు జరుగుతున్నాయని, ఇటీవలే తెలంగాణ సవరించిన డీఎంఎఫ్ సూచనలు అమలు చేస్తోందన్నారు. రాజకీయ జోక్యానికి తావులేకుండా మైనింగ్ ప్రభావిత ప్రాంతాలకు న్యాయం చేసేందుకు ప్రజాప్రతినిధులతో కలెక్టర్లు సమన్వయం చేసుకుని కార్యక్రమాలు చేపట్టాలని, అక్రమ మైనింగ్‌ను అరికట్టడంలో ఇదెంతో ఉపయోగకరమన్న అభిప్రాయం వ్యక్తంచేశారు. తర్వాత రాష్ట్రాల పనితీరును అభినందిస్తూ ప్రశంసపత్రాలు అందజేశారు. అంతకు ముందు జన్‌పథ్‌లో ఏర్పాటు చేసిన డీఎంఎఫ్ ఎగ్జిబిషన్‌ను కేంద్రమంత్రి ప్రారంభించారు.
Updated Date - Jul 10 , 2025 | 04:24 AM