Harish Rao: అనూహ్య అస్వస్థత.. హరీశ్ రావు హుటాహుటిన ఆసుపత్రికి!
ABN, Publish Date - Jun 16 , 2025 | 11:15 PM
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ఆయన్ను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ హాస్పిటల్‌కు తరలించారు.
హైదరాబాద్: తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జ్వరం రావడంతో ఆయన్ను సికింద్రాబాద్‌లోని సన్ షైన్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ వార్త పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగించింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం, సోమవారం సాయంత్రం తెలంగాణ భవన్‌లోనే హరీశ్ రావు స్వల్ప అస్వస్థతకు లోనయ్యారు. ఇదే సమయంలో, ఫార్ములా ఈ రేసింగ్ కేసు విచారణ నిమిత్తం ఏసీబీ అధికారుల ఎదుట హాజరైన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, విచారణ అనంతరం హరీశ్ రావుతో కలిసి మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
అయితే, అప్పటికే హరీశ్ రావు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశంలో ఎక్కువసేపు నిలబడటం వల్ల ఆయన ఆరోగ్యం మరింత క్షీణించిందని సమాచారం. పరిస్థితి గమనించిన కేటీఆర్, మీడియా సమావేశాన్ని మధ్యలోనే ముగించి, హరీశ్ రావును ఆసుపత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఆయన వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.
Updated Date - Jun 16 , 2025 | 11:15 PM