Hyderabad: కమ్యూనిటీ హాల్, ఖాళీ స్థలాల బహిరంగ వేలం వద్దు
ABN, Publish Date - Jun 18 , 2025 | 09:33 AM
ప్రజలకు అవసరమయ్యే కమ్యూనిటీ హాల్, ఖాళీ స్థలాలను ప్రభుత్వం బహిరంగ వేలం వేసే ఆలోచనలు మానుకోవాలని, అలా చేయని పక్షంలో పార్టీలకతీతంగా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన హెచ్చరించారు.
- మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన
హైదరాబాద్: ప్రజలకు అవసరమయ్యే కమ్యూనిటీ హాల్, ఖాళీ స్థలాలను ప్రభుత్వం బహిరంగ వేలం వేసే ఆలోచనలు మానుకోవాలని, అలా చేయని పక్షంలో పార్టీలకతీతంగా ఏకమై ఆందోళన కార్యక్రమాలు చేపడుతామని సనత్‌నగర్ మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన(Former Sanathnagar MLA Katragadda Prasuna) హెచ్చరించారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
ప్రభుత్వానికి నిధులు సమకూర్చేందుకు గృహ నిర్మాణ శాఖ, హౌసింగ్ బోర్డు అధికారులు ప్రభుత్వ స్థలాల విక్రయానికి నివేదికలు అందజేయడం దారుణమన్నారు. నగరంలోనే ఎంతో ప్రాముఖ్యత కలిగిన ఎస్‌ఆర్‌నగర్ కమ్యూనిటీ హాల్(SR Nagar Community Hall)ను విక్రయించే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. ఈ కమ్యూనిటీ హాల్ వేలానికి సంబంధించి 20న వెలువరించనున్న నోటిఫికేషన్ సన్నాహాలను తక్షణమే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి.
ఇంజనీరింగ్‌లో మళ్లీ ‘నచ్చిన సబ్జెక్టులు’!
సౌర విద్యుత్‌పై అవగాహన పెంచాలి
Read Latest Telangana News and National News
Updated Date - Jun 18 , 2025 | 09:33 AM