Hyderabad: హైదరాబాద్ మెట్రోకు యూరోపియన్ వ్లాగర్ ఫిదా..
ABN, Publish Date - Apr 05 , 2025 | 08:23 AM
హైదరాబాద్ మెట్రోకు యూరోపియన్ ఫిదా అయ్యారు. లండన్‌లో ఉన్నట్లుగా సైన్‌బోర్డులు ఉన్నాయంటూ తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. ఇటీవల ఆయన హైదరాబాద్ మెట్రో రైల్లో లక్డీకాపూల్ వరకు ప్రయాణించారు. ఈ సందర్భంగా తన అనుభూతిని పంచుకున్నారు.
హైదరాబాద్ సిటీ: హైదరాబాద్ మెట్రో రైలు(Hyderabad Metro Rail) సేవలకు యూరోపియన్ వ్లాగర్ ఫిదా అయ్యారు. మిస్టర్ ఎబ్రాడ్ యూరోపియన్ వ్లాగర్. ఇటీవలే ఆయన హైదరాబాద్ మెట్రోలో ప్రయాణం చేశాడు. అత్యాధునిక రవాణా సౌకర్యంపై వ్లాగ్ చేసేందుకు ప్యారడైజ్ నుంచి లక్డీకాపూల్(Lakdikapool) వరకు ప్రయాణించిన వ్లాగర్ మంచి అనుభవాన్ని ఎదుర్కొన్నారు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మేకప్‌మెన్ సహా మరో యువకుడి కిడ్నాప్
మెట్రో ప్రయాణంలో భాగంగా అత్యాధునిక నిర్మాణ సౌకర్యాలు, నిర్వహణ విధానాలను ప్రత్యేకంగా పరిశీలించారు. లండన్(London)లో ఉన్నట్లుగా సైన్‌బోర్డులు ఉండడం వల్ల ప్రయాణికులు సులభంగా తమ గమ్యస్థానాలకు వెళ్లేందుకు, వేగంగా టిక్కెట్‌ల కొనుగోలు వంటివి గుర్తించారు. తన ప్రయాణంలో హైదరాబాద్ మెట్రో మంచి అనుభూతిని ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
రెచ్చిపోయిన దొంగలు.. ఏకంగా ఏటీఎంకే ఎసరు పెట్టారుగా..
Read Latest Telangana News and National News
Updated Date - Apr 05 , 2025 | 08:23 AM