TG EAPCET-2025: ఎప్‌సెట్ ఇంజనీరింగ్‌కు 13,137 మంది గైర్హాజరు
ABN, Publish Date - May 05 , 2025 | 04:07 AM
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్-2025 ముగిసింది. గత నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ ప్రవేశ పరీక్షలు జరగ్గా..
గతేడాదికన్నా 33,427 మంది తక్కువగా విద్యార్థులు
హైదరాబాద్, మే 4 (ఆంధ్రజ్యోతి): ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు ఉద్దేశించిన ఎప్‌సెట్-2025 ముగిసింది. గత నెల 29, 30 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ విభాగ ప్రవేశ పరీక్షలు జరగ్గా.. ఈ నెల 2, 3, 4 తేదీల్లో ఇంజనీరింగ్ విభాగ ప్రవేశ పరీక్ష జరిగింది. అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షలకు 86,762 మంది రిజిస్టర్ చేసుకోగా.. పరీక్షలకు 81,198 మంది హాజరయ్యారు. 5,564 మంది (6.41 శాతం) గైర్హాజరయ్యారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 16 జోన్ల పరిధిలో జరిగిన ఇంజనీరింగ్ పరీక్షకు గతేడాదితో పోలిస్తే ఈసారి గైర్హాజరైన విద్యార్థుల సంఖ్య పెరిగింది.
ఈసారి ఎప్‌సెట్ కోసం మొత్తం 3,06,796 దరఖాస్తులు రాగా ఇందులో ఇంజనీరింగ్ దరఖాస్తుదారులు 2,20,327 మందిలో 2,07,190 మంది హాజరయ్యారు. 13,137 మంది (6.34 శాతం) హాజరుకాలేదు. సాధారణంగా ప్రతి ఏటా గైర్హాజరు దాదాపు 5 శాతం వరకు ఉంటుండగా.. ఈసారి ఎక్కువగా నమోదైంది. గతేడాది ఇంజనీరింగ్ పరీక్షకు 2,40,617 మంది హాజరుకాగా ఈసారి 2,07,190 మందే రాశారు. గతేడాదితో పోలిస్తే ఇది 33,427 తక్కువ. ఈసారి పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య బాగా తగ్గడంతో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్‌లో సీట్లు కూడా గతేడాదితో పోలిస్తే చాలా మిగిలిపోతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి:
CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..
AP Liquor Scam: మాజీ ఎంపీ విజయసాయిరెడ్డికి షాక్.. ఆ కేసులో నోటీసులు జారీ..
Supreme Court: వివేకా హత్య కేసు..ఉదయ్ కుమార్ రెడ్డికి సుప్రీం నోటీసులు..
Updated Date - May 05 , 2025 | 04:07 AM