Hyderabad: అత్యాచారయత్నం.. ఆపై బెదిరింపులు భయంతో దివ్యాంగురాలి ఆత్మహత్య
ABN, Publish Date - Jul 21 , 2025 | 04:40 AM
యువకుడి వేధింపులు భరించలేక ఓ దివ్యాంగురాలు అత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేటలో జరిగింది.
హైదరాబాద్‌లోని మీర్‌పేట్‌లో ఘటన
సరూర్‌నగర్, జూలై 20(ఆంధ్రజ్యోతి): యువకుడి వేధింపులు భరించలేక ఓ దివ్యాంగురాలు అత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని మీర్‌పేటలో జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా అన్నంగి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి 12 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వచ్చి అల్మా్‌సగూడలో నివాసముంటున్నారు. ఆయనకు ఓ కుమారుడు, ఇద్దరు దివ్యాంగ (చెవిటి, మూగ) కుమార్తెలున్నారు. పెద్ద కుమార్తె ఇంటి వద్ద టైలరింగ్ చేస్తుంది. ఈ క్రమంలో వారి ఇంటికి ఎదురుగా ఉండే శ్రీకాంత్ అనే యువకుడితో ఆమెకు పరిచయం ఏర్పడింది. 20 రోజుల క్రితం ఇంట్లో ఒంటరిగా ఉన్న యువతిపై శ్రీకాంత్ అత్యాచార యత్నానికి పాల్పడ్డాడు.
ఆమె ప్రతిఘటించడంతో అక్కడి నుంచి పారిపోయాడు. మనస్తాపానికి గురైన యువతి బ్లేడ్‌తో గొంతు కోసుకొని అత్మహత్యకు యత్నించింది, కుటుంబసభ్యులు గమనించి ఆస్పత్రికి తరలించడంతో కోలుకుంది. ఇంటికొచ్చిన తర్వాత కూడా శ్రీకాంత్ వేధింపులు ఆగలేదు. తల్లిదండ్రులకు విషయం చెబితే చంపేస్తానని శ్రీకాంత్ బెదిరించాడని చెల్లెలికి తెలిపింది. ఈ క్రమంలో తనవల్ల తల్లిదండ్రులకు ప్రాణభయం ఉందన్న భయంతో శనివారం ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాంత్ వేధింపులు భరించలేక తమ కుమార్తె అత్మహత్యకు పాల్పడిందని బాధిత యువతి తల్లిదండ్రులు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్
రేవంత్ నాటుకోడి.. కేటీఆర్ బాయిలర్ కోడి
Read latest Telangana News And Telugu News
Updated Date - Jul 21 , 2025 | 04:40 AM