Share News

Yadgiri Spiritual Magazine: త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌

ABN , Publish Date - Jul 20 , 2025 | 04:09 AM

యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్‌ సంస్థ తరఫున త్వరలోనే

Yadgiri Spiritual Magazine: త్వరలో యాదగిరి ఆధ్యాత్మిక మాసపత్రిక, టీవీ చానల్‌
Yadgiri Spiritual Magazine

  • ఇకపై సత్యనారాయణస్వామి వ్రత పూజ టికెట్‌ ధర1000

  • శ్రీవాణి ట్రస్ట్‌ తరహాలో 5 వేలతో గరుడ టికెట్లు: ఈవో

యాదగిరిగుట్ట, జూలై 19 (ఆంధ్రజ్యోతి): యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరిగుట్ట దేవస్థానం ఆధ్వర్యంలో వైటీడీ పబ్లికేషన్‌ సంస్థ తరఫున త్వరలోనే ‘యాదగిరి’ ఆధ్యాత్మిక తెలుగు మాస పత్రిక, టీవీ చానల్‌ను తీసుకురానున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్‌, ఆలయ ఈవో ఎస్‌.వెంకట్‌రావు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కొండ కింద పార్కింగ్‌ ప్రాంతంలో వాహన పూజా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. రూ.800 ఉన్న సత్యనారాయణస్వామి వ్రత పూజా టికెట్‌ ధరను రూ.1,000 చేయనున్నట్లు తెలిపారు. నాణ్యమైన విద్యుత్‌ సరఫరా కోసం రూ.20 కోట్ల వ్యయంతో 4 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌, 4మెగావాట్ల సోలార్‌ పవర్‌ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. స్వామివారి శీఘ్ర దర్శనానికి తిరుమల శ్రీవాణి ట్రస్ట్‌ మాదిరిగా రూ. 5 వేల విలువైన గరుడ టికెట్లను తీసుకురానున్నట్లు తెలిపారు. టికెట్లు పొందిన భక్తులకు సుప్రభాత సేవ నుంచి రాత్రి శయనోత్సవ వేళ వరకు అంతరాలయ ప్రవేశం కల్పించడంతో పాటు స్వామివారి వేద ఆశీర్వచనం, కండువా, కనుము, అయిదు లడ్డూలు, కిలో పులిహోర, కొండపైకి వాహనం అనుమతించి, ఏ సమయంలోనైనా దర్శించుకునే వీలు కల్పిస్తామని పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను ప్రభుత్వానికి నివేదించామని, అనుమతులు రాగానే అమలు చేస్తామని తెలిపారు. రూ.3.6 కోట్ల వ్యయంతో 70 అడుగుల పొడవైన ఆంజనేయ, గరుడ, ప్రహ్లాద, రామానుజ, యాదమహర్షి విగ్రహాల ఏర్పాటుకు అంచనాలు సిద్ధం చేశామని ఆలయ ఈవో తెలిపారు.

ఈ వార్తలు కూడా చదవండి..

తెలంగాణకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్

నేను ఎవరికీ భయపడేది లేదు... బండి సంజయ్‌కి స్ట్రాంగ్ కౌంటర్

Read Latest Telangana News and National News

Updated Date - Jul 20 , 2025 | 04:09 AM