ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna Master Pocso Case: మరో కొరియోగ్రాఫర్‪ పై పోక్సో కేసు.. ఆలస్యంగా వెలుగులోకి..

ABN, Publish Date - Aug 03 , 2025 | 12:13 PM

ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఢీ కొరియోగ్రాఫర్‌ను పోక్సో కేసులో పోలీసులు అరెస్టు చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Choreographer Krishna Master POCSO Act

హైదరాబాద్: సినీ పరిశ్రమలో మరో కొరియోగ్రాఫర్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఉదంతం మరిచిపోకముందే మరో డాన్స్ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో ఢీ కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కంది జైలుకు తరలించారు.

మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణలతో ప్రముఖ రియాలిటీ షో 'ఢీ' కొరియోగ్రాఫర్ కృష్ణ మాస్టర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరులోని ఆయన అన్న నివాసంలో అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు తరలించారు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటనలో షాకింగ్ నిజాలు తెలిశాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, కృష్ణ మాస్టర్‌పై గతనెల బాలిక కుటుంబసభ్యులు గచ్చిబౌలి పీఎస్‌లో కేసు నమోదు చేశారు. పోక్సో కేసు నమోదు అనంతరం కృష్ణ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.

ఇటీవలే కృష్ణ మాస్టర్‌కు ఓ మహిళతో వివాహం జరిగింది. భార్యకు సంబంధించిన రూ.9.50 లక్షలు నగదు తీసుకుని పరారయ్యాడు. ఇదిలా ఉంటే గతంలో కూడా కృష్ణ మాస్టర్‌పై పలు ఆరోపణలు ఉన్నాయి. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పలువురు యువతులను, మహిళలను మోసం చేసినట్లు అభియోగాలు నమోదయ్యాయి.

ఇవి కూడా చదవండి

పేద విద్యార్థులకు బౌద్ధుల సాయం.. బూట్లు, క్రీడాసామగ్రి పంపిణీ..
వారికి రేషన్ కార్డులు రద్దు!

మరిన్ని తెలంగాణ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 03 , 2025 | 04:20 PM