ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: ఎస్సీ ఎంపీని ఆహ్వానించకపోవడం దుర్మార్గం..

ABN, Publish Date - May 18 , 2025 | 09:00 AM

సరస్వతీ పుష్కరాల్లో ధళిత ఎంపీకి తీవ్ర అవమానం జరిగిందని దళిత సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ... ఎంపీ గడ్డం వంశీకృష్ణ దళితుడైనందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సరస్వతీ పుష్కరాలకు ఆహ్వానించకపోవడం దుర్మార్గమన్నారు.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు సరస్వతీ పుష్కరాల్లో ప్రొటోకాల్‌ పాటించకుండా ఎస్సీ ఎంపీ గడ్డం వంశీకృష్ణ(MP Gaddam Vamsi Krishna)ను అవమానించారని పలు దళిత సంఘాల నేతలు ఆరోపించారు. శనివారం హైదర్‌గూడలోని ఎన్‌ఎస్ఎస్‏లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో షెడ్యూల్డ్‌ కులాల హక్కుల పరిరక్షణ సంఘం జాతీయ అధ్యక్షుడు రాజువస్తాద్‌, నేషనల్‌ అంబేడ్కర్‌ సేన జాతీయ అధ్యక్షుడు మన్నె శ్రీధర్‌రావు మాట్లాడారు. ఎంపీ గడ్డం వంశీకృష్ణ దళితుడైనందుకే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సరస్వతీ పుష్కరాలకు ఆహ్వానించకపోవడం దుర్మార్గమన్నారు. ఈ సమావేశంలో ద ళిత సంఘాల నేతలు మధు, మచ్చ శ్రీనివాస్‌, వెంకటేష్‌, విశాల్‌ దాసరి పాల్గొన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: NTPC: ఎన్టీపీసీ విద్యుత్తు కొనుగోలుకు తెలంగాణ ఈఆర్‌సీ సమ్మతి


- నల్లకుంట: కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ఆహ్వానించకుండా ఎస్సీ ఎంపీని అవమానించడం శోచనీయమని జైభీమ్‌ సేన ఫైట్‌ ఫర్‌ రైట్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు పి.బల్వంత్‌రావు పేర్కొన్నారు. శనివారం హైదర్‌గూడలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే కార్యక్రమంలో స్థానిక ఎస్సీ ఎంపీని ఆహ్వానించకపోవడాన్ని తీవ్రంగా ఖండించారు.


- నల్లకుంట: తెలంగాణ రాష్ట్రం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలో ప్రారంభమైన కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలకు ప్రొటోకాల్‌ ప్రకారం ఎంపీ గడ్డం వంశీకృష్ణను ఆహ్వానించకపోవడం అవమానకరమని తెలంగాణ రాష్ట్ర దళిత సేన మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్‌ రెడ్డిమల్ల పార్వతి పేర్కొన్నారు. శనివారం హైదర్‌గూడలో ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఈ వైనంపై మంత్రి శ్రీధర్‌బాబు, దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజ రామయ్యార్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి.

Crocodile Attack: రైతును నీళ్లలోకి లాక్కెళ్లిన మొసలి

Rajanna Sircilla: సిరిసిల్లలో మరో నేతన్న ఆత్మహత్య

తొమ్మిది నెలల క్రితమే వివాహం.. విషాదంలో శ్రీధర్ కుటుంబం

MP Arvind:కాంగ్రెస్‌వి ఓటు బ్యాంకు రాజకీయాలు

Read Latest Telangana News and National News

Updated Date - May 18 , 2025 | 09:00 AM