ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CPI Narayana: సనాతన ధర్మం పాటించే వారిని శిక్షించాలి

ABN, Publish Date - Jun 05 , 2025 | 03:24 AM

ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు.

  • పవన్‌ మూడు పెళ్లిళ్లపై అందుకే స్పందించా: నారాయణ

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌పై సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ మూడు పెళ్లిళ్లపై తాను గతంలో మాట్లాడలేదని, ఆయన సనాతన ధర్మాన్ని నెత్తికెక్కించుకున్న తర్వాత తాను ఆ వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమన్నారు. పవన్‌ కల్యాణ్‌తోపాటు అరాచకమైన, క్రూరమైన సనాతన ధర్మాన్ని పాటించే ప్రతి ఒక్కరిని శిక్షించాలని బుధవారం ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశారు.


సనాతన ధర్మంలో విడాకులే లేనప్పుడు.. పవన్‌ కల్యాణ్‌ తన భార్యలకు ఎలా విడాకులిచ్చారని ప్రశ్నించారు. లౌకికతత్వాన్ని నాశనం చేసే సనాతన ధర్మాన్ని పాటించే వారికి శిక్షించాలే తప్ప.. విమర్శించే వారిని కాదని నారాయణ పేర్కొన్నారు. సనాతన ధర్మం గురించి అడిగితే వాచస్పతి గరికపాటి నరసింహరావు ఏం చెబుతారో వినాలని ఉందన్నారు.

Updated Date - Jun 05 , 2025 | 03:24 AM