Couple Arrested: యాప్‌లో దంపతుల పోర్నోగ్రఫీ
ABN, Publish Date - Jun 27 , 2025 | 03:27 AM
ఆ దంపతులు తొలుత పోర్న్ వీడియోలను చూసేవారు..! ఆ తర్వాత ఓ యాప్‌లో చేరి, డబ్బుకోసం తామే పోర్నోగ్రఫీని లైవ్‌లో చేయడం ప్రారంభించారు..
అంబర్‌పేట్‌లో గలీజు దందా
ఇంటి డాబాపై ప్రత్యేక సెటప్
గుర్తించి, నోటీసులు ఇచ్చిన పోలీసులు
అంబర్‌పేట, జూన్ 26 (ఆంధ్రజ్యోతి): ఆ దంపతులు తొలుత పోర్న్ వీడియోలను చూసేవారు..! ఆ తర్వాత ఓ యాప్‌లో చేరి, డబ్బుకోసం తామే పోర్నోగ్రఫీని లైవ్‌లో చేయడం ప్రారంభించారు..! ఇందుకోసం ఇంటి డాబాపై పరదాలతో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసుకున్నారు..! ముద్దుముద్దుగా.. కవ్వించేలా తెలుగు పోర్నోగ్రఫీ వీక్షకులను ఆకట్టుకుంటూ.. వీడియోలు చేసేవారు..! ఆనోటా ఈనోటా విషయం తెలిసిన హైదరాబాద్ తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగి, వారి ఆట కట్టించారు. అంబర్‌పేట పోలీసుల కథనం ప్రకారం.. బాగ్‌అంబర్‌పేట మల్లికార్జున నగర్‌లో ఉండే వ్యక్తి(42) ఇంటర్ వరకు చదివి.. డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య(37) ఐదో తరగతి వరకు చదువుకున్న గృహిణి. వీరికి ఇంజనీరింగ్, ఇంటర్ చదివే ఇద్దరు కుమార్తెలున్నారు. తొలుత అశ్లీల వెబ్‌సైట్లు, యాప్‌లలో పోర్నోగ్రఫీ చూడడానికి అలవాటు పడ్డ ఈ దంపతులు.. క్రమంగా సులభంగా డబ్బు సంపాదించేందుకు పోర్నోగ్రఫీ యాప్‌లో సభ్యులుగా చేరి, తమ అశ్లీల వీడియోలు అప్‌లోడ్ చేసేవారు.
ఒక్కో వీడియోకు రూ.500 మొదలు.. రూ.2 వేలు వచ్చేవి. దాంతో.. లైవ్ టెలికా్‌స్టలో పోర్నోగ్రఫీకి ఎక్కువ డబ్బులొస్తాయని తెలుసుకుని, తమ డాబాపై పరదాలతో ప్రత్యేకంగా సెటప్ ఏర్పాటు చేశారు. లైవ్‌కాస్ట్ ప్రారంభించారు. ‘‘పోర్నోగ్రఫీ యాప్‌లో వీక్షకులు కోరినట్లు ఈ దంపతులు ప్రవర్తిస్తారు. అశ్లీలం హద్దు మీరాలంటే.. వీక్షకులు వీరికి క్రెడిట్స్ ఇవ్వాలి. ఆ క్రెడిట్స్‌ని వీరు డబ్బుగా మార్చుకుంటారు’’ అని ఈ కేసు విచారణలో పాలుపంచుకుంటున్న ఓ అధికారి వివరించారు. తెలుగు కస్టమర్లు పెరుగుతుండడంతో.. ‘లైవ్ సెక్స్’ కథ తూర్పు మండలం టాస్క్‌ఫోర్స్ పోలీసులకు చేరింది. దాంతో వారు కొంతకాలంగా ఈ దంపతులపై నిఘా పెట్టారు. బుధవారం అదుపులోకి తీసుకుని, అంబర్‌పేట పోలీసులకు అప్పగించారు. అంబర్‌పేట పోలీసులు వారిని విచారించి, ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకు రావాలంటూ నోటీసులు ఇచ్చి పంపారు. కోర్టు ఆదేశిస్తే వారిని రిమాండ్‌కు తరలిస్తామని వివరించారు.
Updated Date - Jun 27 , 2025 | 03:27 AM