కాంట్రాక్టు అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి
ABN, Publish Date - Apr 17 , 2025 | 03:58 AM
రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్దీకరించాలని,, ఆతర్వాతే వర్సిటీల్లో నియామకాలు చేపట్టాలని రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు.
ఇందిరాపార్కు వద్ద మహాధర్నా
కవాడిగూడ, ఏప్రిల్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే క్రమబద్దీకరించాలని,, ఆతర్వాతే వర్సిటీల్లో నియామకాలు చేపట్టాలని రాష్ట్రంలోని 12 విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు వారి ఆధ్వర్యంలో ఇందిరాపార్కు వద్ద బుధవారం మహాధర్నా జరిగింది. ఈ మహాధర్నాకు పలువురు ప్రముఖులు విచ్చేసి.. వారికి మద్దతు ప్రకటించారు. కార్యక్రమానికి విచ్చేసిన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపకులుగా ఉండే గౌరవాన్ని కాంట్రాక్టు వ్యవస్థ నిర్వీర్యం చేసిందన్నారు. ప్రపంచబ్యాంకు విధించిన షరతుల మేరకు కాంట్రాక్టు వ్యవస్థను ప్రవేశపెట్టారని చెప్పారు. 15-20 ఏళ్లుగా పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు.
ఎంపీ ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్రంలో 12 వర్సిటీల్లో పనిచేస్తున్న దాదాపు 1200 కాంట్రాక్టు అధ్యాపకులు 15-20 ఏళ్లుగా పనిచేస్తున్నారని.. ఎలాంటి షరతులు లేకుండా అందరినీ క్రమబద్ధీకరించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు అధ్యాపకుల సమస్యలు పరిష్కరించడంలో పాలకులు విఫలమయ్యారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూన ం నేని సాంబశివరావు ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి, ఎమ్మెల్సీ మదుసుధనాచారి, సీపీఎంరాష్ట్ర కార్యవర్గ సభ్యులు డీజే నర్సింగ్‌రావు, టీపీసీసీ కార్యదర్శి హర్షవర్దన్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అద్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్, పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య తదితరులు పాల్గొని ప్రసంగించారు.
Updated Date - Apr 17 , 2025 | 03:58 AM