ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BC Reservation: కేంద్రం మెడలు వంచైనా 42శాతం సాధిస్తాం

ABN, Publish Date - Aug 01 , 2025 | 03:39 AM

కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు

  • కామారెడ్డి డిక్లరేషన్‌ మేరకు బీసీ రిజర్వేషన్ల హామీని నిలబెట్టుకుంటాం

  • దేశానికి దశ, దిశ రాహులే: మహేశ్‌గౌడ్‌

  • స్థానిక ఎన్నికల్లో పార్టీ ఆమోదించిన అభ్యర్థులకు మద్దతివ్వండి: మీనాక్షి

  • బీసీ రిజర్వేషన్ల పోరాటానికి బీజేపీ, బీఆర్‌ఎస్‌ కలిసి రావాలి: శ్రీధర్‌బాబు

  • పరిగిలో జనహిత పాదయాత్ర ప్రారంభం

వికారాబాద్‌, జూలై 31 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి)/పరిగి: కేంద్రం మెడలు వంచైనా బీసీలకు 42% రిజర్వేషన్లు సాధిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ కుమార్‌గౌడ్‌ అన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో పార్టీ ప్రకటించిన మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతామని స్పష్టం చేశారు. ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ‘కాంగ్రెస్‌ జనహిత పాదయాత్ర’ కార్యక్రమానికి గురువారం వికారాబాద్‌ జిల్లా పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్‌లో ఆయన శ్రీకారం చుట్టారు. ఈ కార్యక్రమంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షీ నటరాజన్‌, రంగారెడ్డి జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిగిలో నిర్వహించిన సమావేశంలో మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ మాట్లాడారు. ‘‘ప్రభుత్వంలో ఉన్నారు.. పాదయాత్ర ఎందుకు?’’ అని కొందరు అంటున్నారని.. ఉచిత బస్సు నుంచి రేషన్‌ కార్డుల వరకు ఇచ్చిన ప్రతి హామీని తమ ప్రభుత్వం నిలబెట్టుకుందని.. ప్రజలకు ఇంకా ఏం కావాలో తెలుసుకునేందుకు, వారి బాగోగులు తెలుసుకునేందుకు, వారికి వాస్తవాలు తెలియజేసి, మరింత చేరువయ్యేందుకు జనహిత పాదయాత్ర ను నిర్వహిస్త్నుట్లు వివరించారు. టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఎన్నో యాత్రలు, పాదయాత్రలు చేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందన్నారు. భారత్‌ జోడో యాత్ర ద్వారా భౌగోళికంగా, సామాజికంగా దేశంలోని వాస్తవ పరిస్థితులను రాహుల్‌ గాంధీ అర్థం చేసుకున్నారని చెప్పారు.

ఏడాదిన్నరలోనే రూ.1.80 లక్షల కోట్ల పెట్టుబడులు

కేసీఆర్‌ రాష్ట్రంపై రూ.7.5 లక్షల కోట్ల అప్పులు రుద్దితే.. ఆ అప్పులకు తమ ప్రభుత్వం వడ్డీలు కడుతూ సంక్షేమ పథకాలను అమలు చేస్తూ.. అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతూ తమ ప్రభుత్వం పాలన సాగిస్తోందని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ చెప్పారు. ఏడాదిన్నర కాలంలోనే రాష్ట్రానికి లక్షా 80 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఫలితంగా వేల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 65 వేల ఉద్యోగాలు ఇచ్చామని, మరో 35 వేల ఉద్యోగాలు త్వరలో ఇస్తామని, రెండేళ్లలో లక్ష ఉద్యోగాలు ఇస్తామన్న హామీ త్వరలో సాకారం చేయనున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కుటుంబ పాలనకు ముగింపు పలికి ప్రజలు కాంగ్రెస్‌ పార్టీకి అధికారం కట్టబెట్టారని తెలిపారు.

గత కేసీఆర్‌ ప్రభ్వుతంలో ఒక్క మహిళా మంత్రి లేరని, తమ పోరాట ఫలితంగానే బీసీ రిజర్వేషన్లు అంటూ ఆ పార్టీకి చెందిన ఓ మహిళానేత మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇక బీఆర్‌ఎస్‌ ఉండదన్నారు. దేశానికి దశ, దిశ రాహుల్‌గాంధీ అని.. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆయన నిస్వార్థంగా తపిస్తున్నారని మహేశ్‌ కుమార్‌ గౌడ్‌ పేర్కొన్నారు. సోనియా గాంధీ మాట ఇచ్చినందుకే తెలంగాణ వచ్చిందని, ఖర్గే, రాహుల్‌గాంధీ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పారు. బీసీలను బీజేపీ మోసం చేస్తోందని ఆయన ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ల కోసం ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీకి తమతో కలిసి రావాలని రాష్ట్ర బీజేపీ నేతలకు విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు. రెడ్డి అయి ఉండి కూడా బీసీల కోసం సీఎం రేవంత్‌రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు.

ఎక్కడికి వెళ్లినా తెలంగాణ గురించే: మీనాక్షి

ప్రతి వ్యక్తి మనసులో ఉన్న ఈశ్వరుడిని దర్శించుకోవడం కోసమే జనహిత పాదయాత్ర అని మీనాక్షీ నటరాజన్‌ అన్నారు. పాదయాత్రలు కాంగ్రె్‌సకు కొత్తేమీ కాదని, పవిత్ర స్థలాలకు పాదయాత్రతో వెళితేనే దేవుడి అంతరంగం తెలుస్తుందన్నారు. భారత్‌ జోడో యాత్రతో రాహుల్‌గాంధీ 3,500 కిలోమీటర్లు పాదయాత్ర చేసి తమకు మార్గం చూపించారని, తాము ఆ మార్గాన్ని అనుసరిస్తూ జనం మధ్యలోకి వచ్చామని ఆమె ప్రజలను ఉద్దేశించి అన్నారు. రాహుల్‌గాంధీ ఎక్కడికి వెళ్లినా తెలంగాణ మోడల్‌ గురించే చెబుతుంటారని పేర్కొన్నారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంపై కాంగ్రెస్‌ పోరాటం చేస్తోందని, 6న ఢిల్లీలో పార్లమెంట్‌ ముందు నిర్వహించే ధర్నాకు అందరూ సహకరించాలని పిలుపునిచ్చారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఆమోదించిన అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

దేశంలోనే తెలంగాణ ఆదర్శం: శ్రీధర్‌బాబు

తెలంగాణలో కులగణన, బీసీకు 42 శాతం రిజర్వేషన్లతో తెలంగాణ మిగతా రాష్ట్రాలకు ఆదర్శం కానుందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. బీజేపీ, బీఆర్‌ఎ్‌సలకు చిత్తశుద్ధి ఉంటే బీసీ రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్‌ చేస్తున్న పోరాటానికి కలిసి రావాలని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ చేపట్టిన జనహిత పాదయాత్ర స్థానిక సంస్థల ఎన్నికల కోసం కాదని, ప్రజాహితం కోసమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు రాంమోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, వీర్లపల్లి శంకర్‌, పర్ణికారెడ్డి, మాజీ ఎంపీలు వి.హనుమంతరావు, మధుయాష్కీగౌడ్‌, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శంకర్‌నాయక్‌ పాల్గొన్నారు.

8 కిలోమీటర్ల పాదయాత్ర

రంగాపూర్‌లో పార్టీ జెండా ఎగురవేసిన తర్వాత మహేశ్‌గౌడ్‌ పాదయాత్ర ప్రారంభించారు. 8 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. రాత్రి పరిగిలోని ఎస్‌ గార్డెన్స్‌లో భోజనం చేసిన తర్వాత అక్కడే నిద్రకు ఉపక్రమించారు. జనహిత పాదయాత్రలో భాగంగా రెండోరోజైన శుక్రవారం ఉదయం 7 గంటలకు గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో శ్రమదానం, మొక్కలు నాటే కార్యక్రమంలో మహేశ్‌గౌడ్‌, మీనాక్షి పాల్గొంటారు. అనంతరం ఎస్‌ గార్డెన్స్‌లో పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 03:39 AM