ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Mahesh Kumar Goud: గద్దర్‌ అవార్డులతో సినీ రంగానికి సర్కారు గౌరవం

ABN, Publish Date - Jun 16 , 2025 | 04:32 AM

గద్దర్‌ అవార్డుల ప్రదానంతో సినీ రంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవం తీసుకువచ్చిందని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు.

  • టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌ గౌడ్‌

రాంనగర్‌, జూన్‌ 15 (ఆంధ్రజ్యోతి): గద్దర్‌ అవార్డుల ప్రదానంతో సినీ రంగానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం గౌరవం తీసుకువచ్చిందని టీపీసీసీ చీఫ్‌ మహే్‌షకుమార్‌గౌడ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల అభివృద్ధికి కృషి చేస్తోందని.. అందులో భాగంగానే గద్దర్‌ అవార్డుల ప్రదాన కార్యక్రమం నిర్వహించిందన్నారు. గత 11 ఏళ్లలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నంది అవార్డుల ప్రదానం నిర్వహించకుండా సినీ రంగానికి నిర్లక్ష్యం చేసిందని.. ఈ విషయాన్ని కాంగ్రెస్‌ కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఆదివారం మహేశ్‌ గౌడ్‌ను ఖైరతాబాద్‌ జిల్లా కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి తొలుపునూరి కృష్ణగౌడ్‌, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి జి.నాగభూషణం, కార్యదర్శి యాదగిరిగౌడ్‌ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. గద్దర్‌ అవార్డులను ప్రదానం చేసినందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jun 16 , 2025 | 04:32 AM