Congress: పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలి
ABN, Publish Date - Jul 27 , 2025 | 05:58 AM
సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత, నిరాధార ఆరోపణలు చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన కాంగ్రెస్, యూత్ కాంగ్రెస్ నేతలు
దళిత పరిరక్షకుడు సీఎం రేవంత్‌పై అడ్డగోలుగా మాట్లాడితే దళిత సమాజం ఊరుకోదు: సంపత్‌కుమార్
కడ్తాల్/శంకర్‌పల్లి/చేవెళ్ల/చౌదరిగూడ/కేశంపేట/షాద్‌నగర్/హైదరాబాద్, జూలై 26 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత, నిరాధార ఆరోపణలు చేసిన హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి వెంటనే క్షమాపణ చెప్పకపోతే యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కేసీఆర్, కేటీఆర్ మెప్పు కోసం సీఎం ప్రతిష్ఠను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదన్నారు. కౌశిక్‌రెడ్డి ఏవిధంగా ప్రజలను మోసగించి, బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసి ఎమ్మెల్యేగా గెలిచారో అందరికి తెలుసని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డిపై ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలు శనివారం హైదరాబాద్‌లో ఉద్రిక్తతలకు దారితీసింది. దాడి చేస్తామంటూ కాంగ్రెస్, ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు హెచ్చరికలు చేయడంతో పోలీసులు కౌశిక్‌రెడ్డి ఇంటి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ నేతలు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో కౌశిక్‌రెడ్డి ఇంటికి చేరుకుని సాయంత్రం వరకు ఉండి వెళ్లిపోయారు. ఎన్‌ఎ్‌సయూఐ నాయకులు కొండాపూర్‌లో కౌశిక్‌రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేసి, కౌశిక్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజ్యాంగ, దళిత పరిరక్షకుడు అయిన సీఎం రేవంత్‌రెడ్డిపై అడ్డగోలుగా మాట్లాడితే దళిత సమాజం ఊరుకోదని ఏఐసీసీ కార్యదర్శి సంపత్‌కుమార్ హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు మతిస్థిమితం కోల్పోయి మాట్లాడుతన్నారని మండిపడ్డారు. సాగునీటి విడుదల విషయంలో హరీశ్‌రావు డ్రామాలు మొదలెట్టారని విమర్శించారు. దళితుల భూముల విషయంతో, నేరెళ్ళ ఘటనలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన బీఆర్‌ఎస్ చరిత్రను ప్రజలు మరిచిపోలేదన్నారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వ క్యాబినెట్‌లో దళితులు ఒక్కరూ లేరని, ఇప్పుడు నలుగురు మంత్రులున్నారని చెప్పారు.
Updated Date - Jul 27 , 2025 | 05:58 AM