ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

KTR Remarks: సీఎం రేవంత్‌పై అనుచిత వ్యాఖ్యలు.. కేటీఆర్‌పై కాంగ్రెస్‌ నేతల ఫిర్యాదు

ABN, Publish Date - Jun 15 , 2025 | 04:45 AM

సీఎం రేవంత్‌రెడ్డిపై ఈనెల 11న కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌

చిక్కడపల్లి, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్‌రెడ్డిపై ఈనెల 11న కేటీఆర్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీపీసీసీ లీగల్‌సెల్‌ కన్వీనర్‌, హైకోర్టు న్యాయవాది దోనేటి భానుచందర్‌, కాంగ్రెస్‌ నాయకులు చిక్కడపల్లి పోలీ్‌సస్టేషన్‌లో శనివారం ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌.. సీఎంను కించపరుస్తూ ఆయనపై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెబుతూ ఆ ప్రసంగ వీడియోను పోలీసులకు చూపించారు.

ఈ సందర్భంగా భానుచందర్‌ మాట్లాడుతూ... సీఎం రేవంత్‌రెడ్డిపై కేటీఆర్‌ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించాలని, కేటీఆర్‌పై బీఎ్‌సఎస్‌ యాక్ట్‌ 356, 352, 353, 296 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Updated Date - Jun 15 , 2025 | 04:45 AM