ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

MLC Kavita: పరిహారం ఎకరాకు రూ.40 లక్షలివ్వాలి

ABN, Publish Date - Aug 01 , 2025 | 03:31 AM

నారాయణపేట కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.40 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని

  • ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: ఎమ్మెల్సీ కవిత

దామరగిద్ద, జూలై 31 (ఆంధ్రజ్యోతి): నారాయణపేట-కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో భాగంగా భూములు కోల్పోయే రైతులకు ఎకరాకు రూ.40 లక్షల వరకు పరిహారం ఇవ్వాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. ఇప్పటికే ఎకరాకు రూ.20 లక్షలు ఇస్తానని సీఎం రేవంత్‌రెడ్డి మాట ఇచ్చారని, కానీ, ఎకరాకు రూ.14 లక్షల ధర నిర్ణయించి రైతులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. గురువారం నారాయణపేట జిల్లా దామరగిద్ద మండల పరిధిలోని కానుకుర్తి గ్రామంలో భూ నిర్వాసితుల సభ బీఆర్‌ఎస్‌ సీనియర్‌ నేత శ్రీనివాస్‌ అఽఽధ్యక్షతన జరిగింది. ఈ సభలో కవిత మాట్లాడుతూ.. భూ నిర్వాసితులకు 2013 భూసేకరణ చట్టాన్ని అమలు చేసి పరిహారంతో పాటు ఇంటికో ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను కేసీఆర్‌ దిగిపోయేనాటికి 95ు పూర్తి చేశారన్నారు. మిగతా 5% పనులు పూర్తి చేస్తే పాలమూరు పచ్చబడుతుందన్నారు. ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుపై సుప్రీం కోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని ఆమె చెప్పారు.

ఈ వార్తలు కూడా చదవండి..

జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్

జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..

For More Telangana News And Telugu News

Updated Date - Aug 01 , 2025 | 03:31 AM