ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Krishna Water: కృష్ణా జలాల్లో న్యాయమైన వాటా సాధించాలి

ABN, Publish Date - May 15 , 2025 | 03:16 AM

కృష్ణా జలాల్లో న్యాయమైన 70 శాతం వాటా సాధించేలా ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు.

  • సమ్మక్క సాగర్‌కు త్వరలోనే ఎన్‌వోసీ

  • ఈ ద ఫా ప్రాధాన్య ప్రాజెక్టులకే నిధులు

  • 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యం

  • ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

హైదరాబాద్‌, మే 14 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో న్యాయమైన 70 శాతం వాటా సాధించేలా ట్రైబ్యునల్‌లో బలమైన వాదనలు వినిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధికారులకు సూచించారు. బుధవారం రాత్రి జలసౌధలో నీటి పారుదల ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ‘పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే నీటికి బదులుగా సాగర్‌ ఎగువన ఉన్న రాష్ట్రాలు 80 టీఎంసీలు వాడుకోవాలని బచావత్‌ ట్రైబ్యునల్‌ వెసులుబాటు ఇచ్చింది. 35 టీఎంసీలను మహారాష్ట్ర, కర్ణాటక వాడుకోవడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నందున... మిగిలిన 45 టీఎంసీలపై తెలంగాణకే పూర్తి హక్కు ఉంది. ఆ నీటిని ద క్కేలా చూడాల’ని సీఎం సూచించారు. సమ్మక్కసాగర్‌ బ్యారేజీకి ఛత్తీ్‌సగఢ్‌ నుంచి నిరభ్యంతర పత్రం (ఎన్‌వోసీ) వారం రోజుల్లో రానుందని, ఆ తర్వాత కేంద్ర జలవనరుల సంఘం నుంచి ప్రాజెక్టు డీపీఆర్‌కు క్లియరెన్స్‌ సాధించాలని సూచించారు.


ఈ ఆర్థిక సంవత్సరంలో నిధులన్నీ ప్రాధాన్య ప్రాజెక్టులకు ఇస్తామని, 5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వడమే లక్ష్యమని చెప్పారు. రూ.లక్షల కోట్లు పెట్టిన కాళేశ్వరంలోని బ్యారేజీ కుంగిందని, పట్టుమని 50 వేల ఎకరాలకు నీరు అందించలేని పరిస్థితి ఉందన్నారు. కాబట్టి తక్కువ నిధులతో ఎక్కువ ఆయకట్టు అందించే ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. 2027 జూన్‌ నాటికి కృష్ణా బేసిన్‌లో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేసేలా లక్ష్యం నిర్దేశించుకోవాలన్నారు. ఎస్‌ జైపాల్‌రెడ్డి పాలమూరు-రంగారె డ్డి ఎత్తిపోతల పథకాన్ని ఉద్ధండపూర్‌ దాకా పూర్తి చేయడానికి తొలిప్రాధాన్యం ఇవ్వాలని చెప్పారు. కోయిల్‌సాగర్‌ లిఫ్టును 2026 జూన్‌లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. మహాత్మాగాంధీ కల్వకుర్తి, జవహర్‌ నెట్టెంపాడు, రాజీవ్‌ బీమా ఎత్తిపోతల పథకాలను ఈ ఏడాది డిసెంబరుకల్లా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రణాళిక సంఘం ఉప చైర్మన్‌ చిన్నారెడ్డి, జగ్గారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీ్‌పకుమార్‌ సుల్తానియా, సీఎంవో కార్యదర్శి మాణిక్కరాజ్‌ కన్నన్‌, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.


ఉత్తమ్‌ను సీఎం అని సంబోధించిన రేవంత్‌

సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డిని ముఖ్యమంత్రి అని.. సీఎం రేవంత్‌రెడ్డి సంబోధించారు. సాగునీటి పారుదల శాఖకు సంబంధించి ఉద్యోగ నియామక పత్రాల అందజేత కార్యక్రమంలో రేవంత్‌రెడ్డి ఎస్‌ఎల్‌బీసీ గురించి ప్రస్తావిస్తూ... ఉత్తమ్‌ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యాక ఆ ప్రాజెక్టులో కదలిక వచ్చిందని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 15 , 2025 | 03:16 AM