CM Revanth: కొత్త రేషన్ కార్డుల పంపిణీ వేళ.. సీఎం రేవంత్ ఆసక్తికర ట్వీట్..!
ABN, Publish Date - Jul 14 , 2025 | 04:31 PM
సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చేతుల మీదుగా కొత్త రేషన్ కార్డు(Ration Cards)ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సీఎం ఎక్స్ వేదికగా సన్నబియ్యం పథకంపై ఆసక్తికర ట్వీట్ చేశారు.
CM Revanth Ration Card: తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సూర్యాపేట జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభమైంది. రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్ కార్డులు అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది ప్రభుత్వం. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు సీఎం. 'సన్నబియ్యంతో తెలంగాణ పల్లెల్లోని రేషన్ షాపుల వద్ద సందడి సంతరించుకుంది. కొత్త రేషన్ కార్డుల కోసంపేదవాడి పదేళ్ల ఎదురు చూపులు నేడు ఫలించబోతున్నాయి. రాష్ట్రంలో 5.61 లక్షల మందికి కొత్త రేషన్ కార్డులు, 3.10 కోట్ల మందికి ఆహార భద్రత, ఒక్కొక్కరికి ఆరు కేజీల ఉచిత సన్నబియ్యం. ఇదీ పేదల సంక్షేమం పట్ల మా వజ్ర సంకల్పం.' అని ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
అలాగే ఉజ్వల తెలంగాణ భవితే లక్ష్యంగా రాష్ట్ర పునర్ నిర్మాణం కోసం తమ ప్రభుత్వం చేస్తోన్న యజ్ఞం దిగ్విజయం అయ్యేలా ఆశీర్వదించమని ఉజ్జయిని మహంకాళిని మనసారా కోరుకున్నంట్లు మరో ట్వీట్‌లో సీఎం పేర్కొన్నారు.
రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘శ్రీమద్భాగవతం-పార్ట్1’ చిత్రీకరణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. సాగర్ పిక్చర్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, 'శ్రీమద్ భాగవతం సినిమా తీయాలన్న ఆలోచన వచ్చినందుకు సినిమా టీమ్ ను అభినందిస్తున్నాను. నలభై ఏళ్ల క్రితం రామానంద సాగర్ రూపొందించిన రామాయణం సీరియల్ అందరికీ చేరువైంది. కొవిడ్ టైంలో మళ్లీ టెలికాస్ట్ చేస్తే ప్రపంచ రికార్డు సృష్టించింది. ఇక, 2035 లోగా తెలంగాణను 1 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని మేం సంకల్పించాం. 2047 నాటికి 3 ట్రిలియన్ ఎకానమీగా తీర్చిదిద్దాలని ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఇందుకోసం 2047 విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేసుకుంటున్నాం. 2047 విజన్ డాక్యుమెంట్‌లో సినిమా రంగానికి ఒక ప్రత్యేక చాప్టర్ ఉంటుంది. ఆనాడు రామానంద్ సాగర్ తీసిన రామాయణం సీరియల్ ఎంత పాపులర్ అయిందో.. శ్రీమద్ భాగవతం పార్ట్-1 సినిమా అంత హిట్ అవ్వాలని కోరుకుంటున్నా.' అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ చేసిన తప్పులను మాపై రుద్దుతున్నారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్
కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ.. ఎందుకంటే
Read Latest Telangana News And Telugu News
Updated Date - Jul 14 , 2025 | 04:59 PM