Revanth Reddy Delhi Meeting: నేడు ఢిల్లీకి సీఎం రేవంత్
ABN, Publish Date - Jul 23 , 2025 | 06:01 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం..
సాయంత్రం సోనియాగాంధీతో భేటీ
సుదీర్ఘకాలం తరువాత కలుస్తున్న సీఎం
గతేడాది మార్చి తరువాత మళ్లీ ఇప్పుడేకీలక అంశాలపై చర్చించే అవకాశం
రేపు ఇండి కూటమి ఎంపీలతో.. ఏఐసీసీ కార్యాలయంలో సమావేశం
బీసీల 42 శాతం రిజర్వేషన్లపై..పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించే విషయంపై పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు. అలాగే రిజర్వేషన్ల పెంపు, ఆవశ్యకతను తెలుపుతూ ఇండి కూటమి ఎంపీలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. సాయంత్రం 5 గంటలకు ఏఐసీసీ కార్యాలయంలో ఈ సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు, సామాజిక వర్గాల వారీ వివరాలను ఎంపీలకు వివరించనున్నారు. రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించుకుని కేంద్రానికి పంపిన రెండు బీసీ బిల్లులను ఆమోదించేలా పార్లమెంటులో చర్చ పెట్టాలని ఎంపీలను కోరనున్నారు. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీని కూడా కలిసి ఈ అంశంపై మాట్లాడనున్నట్టు సమాచారం. కాగా, సీఎం రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రమే సోనియాగాంధీని కలవనున్నారు. సుదీర్ఘకాలం తరువాత ఆమెను సీఎం కలుస్తుండడం ప్రాధాన్యం సంతరించుకుంది. చివరిగా గత ఏడాది మార్చిలో సోనియాను కలిసిన రేవంత్‌రెడ్డి.. మళ్లీ ఇన్నాళ్ల తరువాత కలుస్తున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టాక సోనియాతో రేవంత్ భేటీ అవుతుండడం మూడోసారి మాత్రమే కావడం గమనార్హం. ఈ సందర్భంగా పలు కీలక అంశాలపై ఆమెతో చర్చించనున్నట్లు సమాచారం.
ఈ నెల 30న ‘ప్రగతి’ సమావేశం
పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై చర్చ!
ఈ నెల 30న జరగనున్న ప్రగతి సమావేశంలో ప్రధాని మోదీ పోలవరం బ్యాక్ వాటర్ ముంపుపై ప్రభావిత రాష్ట్రాలతో చర్చించే అవకాశాలున్నాయి. ఈ మేరకు మంగళవారం రాష్ట్రాలకు కేంద్రం నుంచి సమాచారం అందింది. వాస్తవానికి ఇప్పటికే రెండు దఫాలుగా ప్రగతి సమావేశం అజెండా నుంచి పోలవరం బ్యాక్ వాటర్ ముంపు అంశం మాయమయింది. ప్రధానమంత్రి స్వయంగా ప్రగతి సమావేశంలో పోలవరం బ్యాక్‌వాటర్ ముంపుపై చర్చిస్తారని రెండు దఫాలుగా సమాచారం ఇచ్చినా, అజెండా నుంచే ఈ అంశం పూర్తిగా మాయమైంది. ఈ నెల 30వ తేదీన జరిగే సమావేశంలోనైనా ఈ అంశం చర్చకు వస్తుందా...? లేక మాయమవుతుందా...? అనే దానిపై డైలమా నెలకొంది.
ఈ వార్తలు కూడా చదవండి..
కోర్టును ఆశ్రయించిన మహిళ.. సీజేఐ ఆసక్తికర వ్యాఖ్యలు
ధన్‌ఖఢ్ రాజీనామా వెనుక నితీష్‌ను తప్పించే కుట్ర.. ఆర్జేడీ ఆరోపణ
మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి
Updated Date - Jul 23 , 2025 | 06:01 AM