ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: నేడు సంగారెడ్డికి సీఎం రేవంత్‌

ABN, Publish Date - May 23 , 2025 | 04:50 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.

  • పలు అభివృద్ధి పనులకు శ్రీకారం.. పస్తాపూర్‌లో సభ

హైదరాబాద్‌/జహీరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు ప్రాజెక్టులను ప్రారంభించడంతో పాటు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ కూడా ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా సీఎం జహీరాబాద్‌ నియోజకవర్గంలో బసవేశ్వర విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.


ఆ తర్వాత రూ.వంద కోట్లతో నిర్మించిన రైల్వే ఓవర్‌ బ్రిడ్జి, రూ.26 కోట్లతో నిర్మించిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభిస్తారు. అనంతరం.. రూ.100 కోట్లతో నిమ్జ్‌ రోడ్డు ప్రారంభించడంతో పాటు చిరాగ్‌పల్లి-ఇప్పపల్లి గ్రామాల మధ్య రూ.20 కోట్లతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత పస్తాపూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు హాజరై ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు, మహిళా సంఘాలకు చెక్కులు పంపిణీ చేయనున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

jagtyaala : పాఠ్య పుస్తకాలు వస్తున్నాయి..

Crime News: తెలంగాణ భవన్ నుంచి సైబర్ నేరస్తుడు పరారీ..

TG News: ఢీకొన్న రెండు కార్లు.. ఆ తర్వాత ఏమైందంటే..

Indigo Flight Delay: ఇండిగో విమానంలో సాంకేతిక సమస్య

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 23 , 2025 | 04:50 AM