ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ఉస్మానియా వైద్యులకు సీఎం రేవంత్‌ అభినందనలు

ABN, Publish Date - Apr 19 , 2025 | 04:08 AM

ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రి నిరాకరించగా.. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విక్రమ్‌, రంగా అజ్మీరా శస్త్రచికిత్స చేసి కాపాడిన విషయం తెలిసిందే.

  • ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజల్లో విశ్వాసం పెంచారని వ్యాఖ్య

  • ‘ఆంధ్రజ్యోతి’ కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ ‘ఎక్స్‌’లో పోస్టు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 18 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్న రోగికి చికిత్స చేసేందుకు ప్రైవేటు ఆస్పత్రి నిరాకరించగా.. ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు విక్రమ్‌, రంగా అజ్మీరా శస్త్రచికిత్స చేసి కాపాడిన విషయం తెలిసిందే. గత నెల 29న ఈ ఘటన జరగ్గా.. ‘‘ప్రైవేటు ఆసుపత్రి పొమ్మంటే.. సర్కారు దవాఖానా ప్రాణాలు నిలిపింది’’ శీర్షికన గురువారం ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకొచ్చింది. ఈ కథనాన్ని ట్యాగ్‌ చేస్తూ ‘ఎక్స్‌’లో సీఎం రేవంత్‌ పోస్టు పెట్టారు. విశాఖకు చెందిన హేమంత్‌ అనే వ్యక్తికి సకాలంలో శస్త్రచికిత్స చేసి ప్రాణాలు కాపాడిన చేసిన వైద్యులు విక్రమ్‌, రంగా అజ్మీరాను ప్రత్యేకంగా అభినందించారు.


‘‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అనే నానుడిని తిరగరాసి.. ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు తలచుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరని రుజువు చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని పెంచిన ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు డాక్టర్‌ అజ్మీరా, డాక్టర్‌ విక్రమ్‌.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందికి ఆదర్శంగా నిలిచారు. మీకు నా అభినందనలు’’ అని పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి

CM Revanth Reddy: ఫోర్త్‌ సిటీకి మెట్రో అనుమతులు.. పరుగెత్తించండి

Vijayashanti: రోడ్డుకీడుస్తా... కసి తీరే వరకు చంపుతా

Air Pollution: గర్భస్థ శిశువులూ ఉక్కిరిబిక్కిరి!

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 19 , 2025 | 04:08 AM