ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

CM Revanth Reddy: ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ

ABN, Publish Date - Apr 28 , 2025 | 06:23 AM

ప్రపంచ ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో తెలంగాణ దిక్సూచి అవుతుందని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. భారత్‌ సమ్మిట్‌-2025 ముగింపు సందర్భంగా తెలంగాణలో అభివృద్ధి, ప్రజాస్వామ్య పరిరక్షణపై విశేషాలు పంచుకున్నారు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 27 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధిలోనే కాదు.. ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ అని ము ఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ వేదికగా హెచ్‌ఐసీసీలో 2 రోజుల పాటు జరిగిన భారత్‌ సమ్మిట్‌-2025 ముగిసిన నేపథ్యంలో ఆదివారం ‘ఎక్స్‌’లో స్పందించారు. ‘తెలంగాణ వేదికగా వందకు పైగా దేశాలు.. వందల ఆలోచనల సంఘర్షణలు.. లక్ష్యం ఒక్కటే.. ప్రపంచ ప్రజాస్వామ్యానికి ప్రాణం పోయడం. ప్రజల హక్కుల్లో.. సమానత్వాన్ని చాటడం. రాహుల్‌గాంధీ దిశానిర్దేశంలో.. అభివృద్ధిలోనే కాదు.. ప్రజాస్వామ్య పునరుజ్జీవనంలో సైతం.. ప్రపంచానికి దిక్సూచి తెలంగాణ’ అని పోస్టులో పేర్కొన్నారు. భారత్‌ సమ్మిట్‌ వీడియోను దానికి ట్యాగ్‌ చేశారు. కాగా, రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ చైర్‌పర్సన్‌ సీతాదయాకర్‌రెడ్డి, కమిషన్‌ సభ్యులు సీఎంను జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. కమిషన్‌ చైౖర్‌పర్సన్‌గా, సభ్యులుగా బాధ్యతలు తీసుకున్న వారికి సీఎంతో పాటు అక్కడే ఉన్న మంత్రి సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - Apr 28 , 2025 | 06:24 AM