Revanth Reddy: దేశానికే రోల్‌మోడల్‌గా నిలిచిన రాష్ట్రం
ABN, Publish Date - May 03 , 2025 | 04:39 AM
దేశవ్యాప్తంగా జరగబోయే ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియకు తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలవడం తనకెంతో గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు.
దేశానికే రోల్‌మోడల్ నిలిచిన రాష్ట్రం
తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో
చాటిన ప్రతి ఒక్కరికీ అభినందనలు
‘ఎక్స్’ వేదికగా సీఎం రేవంత్‌రెడ్డి సంతోషం
న్యూఢిల్లీ, మే 2 (ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా జరగబోయే ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియకు తెలంగాణ రోల్‌మోడల్‌గా నిలవడం తనకెంతో గర్వకారణంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం ఢిల్లీలో సీడబ్ల్యూసీ సమావేశం ముగిసిన తర్వాత ఆయన ‘ఎక్స్’ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు. ‘‘జనగణనలో కులగణనకు తెలంగాణ మోడల్‌ను పరిగణనలోకి తీసుకోవాలని సీడబ్ల్యూసీ కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ తీర్మానం చేసింది. నాలుగు గోడల మధ్య, నలుగురి ఆలోచనలతో కాకుండా.. మొత్తం పౌరసమాజం, తెలంగాణ మేధావులు, వివిధ కులసంఘాల నాయకులు, విద్యావేత్తల నుంచి అత్యంత పారదర్శకంగా సలహాలు, సూచనలు స్వీకరించి శాస్త్రీయంగా తెలంగాణ ప్రభుత్వం కులగణన చేపట్టిన విషయాన్ని సీడబ్ల్యూసీ తన తీన్మానంలో ప్రస్తావించింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం.
ఒక గొప్ప సామాజిక విప్లవానికి నాంది పలికే ప్రక్రియ విషయంలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్‌గా నిలవడం నాకెంతో గర్వకారణంగా ఉంది. అత్యద్భుతంగా, అత్యంత పారదర్శకంగా కులగణన నిర్వహించి తెలంగాణ ప్రతిష్ఠను దేశ స్థాయిలో చాటిన ప్రతి ఒక్కరికీ మరోసారి నా అభినందనలు’’ అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంతకుముందు సీడబ్ల్యూసీ సమావేశంలో రేవంత్‌రెడ్డి ప్రసంగిస్తూ తాము కేవలం కులాల లెక్కలు మాత్రమే తీయలేదని, వెనుకబడిన వర్గాల సామాజిక, ఆర్థిక, విద్యా పరమైన వెనుకబాటుతనాన్ని కచ్చితంగా నిర్ధారించామని చెప్పారు. ఇంత పకడ్బందీగా కులగణన గతంలో ఎప్పుడూ జరగలేదని తెలిపారు. తాము జరిపిన కులగణన ఆధారంగా అభివృద్ధి ఫలాలను, ఉపాధి కల్పనను అందించే విషయంపై చర్యలు ప్రారంభించామన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నూతన మేయర్‌గా కోవెలమూడి రవీంద్ర ఎన్నిక
హరిరామ్ బ్యాంక్ లాకర్లను ఓపెన్ చేయనున్న ఏసీబీ అధికారులు...
విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
For More AP News and Telugu News
Updated Date - May 03 , 2025 | 04:39 AM