Chandrababu Concern: సుజనాకు చంద్రబాబు పరామర్శ
ABN, Publish Date - May 18 , 2025 | 04:46 AM
బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని సీఎం చంద్రబాబు హైదరాబాద్‌లో పరామర్శించారు. త్వరగా కోలుకుని ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
హైదరాబాద్, మే 17(ఆంధ్రజ్యోతి): బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరిని సీఎం చంద్రబాబు శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పరామర్శించారు. యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని ఆకాంక్షించారు. ఇటివలే సింగపూర్‌కు వెళ్లిన సుజనా చౌదరి అక్కడ ప్రమాదవశాత్తు జారిపడ్డారు. హైదరాబాద్‌లో శస్త్ర చికిత్స చేయించుకున్నారు. పరామర్శ అనంతరం సుజనా, చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందిస్తూ.. ‘వారి ఆదరణ, ఆశీస్సులు నాకు ఎల్లప్పుడూ బలాన్నిస్తాయి. భగవంతుని ఆశీస్సులతో త్వరలో కోలుకుని ప్రజాసేవకు పునరంకితం అవుతా’ అని అన్నారు.
Updated Date - May 18 , 2025 | 04:47 AM