ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

తెలంగాణలో పెరిగిన ఐపీఎస్‌‌ల సంఖ్య

ABN, Publish Date - May 23 , 2025 | 05:13 AM

భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్‌స)లకు సంబంధించిన క్యాడర్‌ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ జరిగింది.

  • 139 నుంచి 151కి పెంచిన కేంద్రం

  • 168 పోస్టులు కావాలని అడిగిన సీఎం

హైదరాబాద్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): భారతీయ పోలీసు సర్వీసు (ఐపీఎ్‌స)లకు సంబంధించిన క్యాడర్‌ రివ్యూను కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దాదాపు 9 ఏళ్ల తర్వాత దేశవ్యాప్తంగా ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూ జరిగింది. తెలంగాణలో ఐపీఎస్‌ క్యాడర్‌ పోస్టులను 139 నుంచి 151కి (12 పోస్టులను) పెంచుతూ హోంశాఖ గెజిట్‌ జారీ చేసింది. దాని ప్రకారం 151 పోస్టులలో డీజీపీతో సహా క్యాడర్‌ సీనియర్‌ డ్యూటీ 83, సెంట్రల్‌ డిప్యూటేషన్‌ రిజర్వ్‌ 33, స్టేట్‌ డిప్యూటేషన్‌ రిజర్వ్‌ 20, ట్రైనింగ్‌ రిజర్వ్‌ 2, లీవ్‌ రిజర్వ్‌, జూనియర్‌ పోస్టులు 13 ఉన్నట్లు కేంద్రం పేర్కొంది.


వాటిలో ప్రమోషన్‌ ద్వారా భర్తీ చేసిన పోస్టులు 46, డైరక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీ చేసే పోస్టులు 105గా ఉంటాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని పలుమార్లు ఐపీఎ్‌సల సంఖ్య పెంచాలని కోరింది. తెలంగాణకు 168 ఐపీఎ్‌సలు అవసరమని సీఎం రేవంత్‌రెడ్డి గతంలో ప్రధాని మోదీకి, హోంమంత్రి అమిత్‌షాకు వినతి పత్రాలు ఇచ్చిన విషయం తెలిసిందే.

Updated Date - May 23 , 2025 | 05:13 AM