ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Lok Sabha: అన్ని రాష్ట్రాల్లో లోక్‌సభ సీట్లు 20 శాతం పెంపు!

ABN, Publish Date - Jun 22 , 2025 | 04:27 AM

దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది.

‘జనగణన’తో పునర్విభజన చేసినా సమానంగా పెంచే యోచనలో కేంద్రం

  • దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరగకుండా చూసేందుకే

  • ఉత్తరాదిలో జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలేవీ లేవంటున్న కేంద్ర ప్రభుత్వ వర్గాలు

  • జనగణన తర్వాతే స్పష్టత వస్తుందన్న అభిప్రాయాలు

  • వచ్చే పార్లమెంటు సమావేశాల్లోనే ‘జమిలి’ బిల్లు

  • నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం కోటాపై స్పష్టత ఇవ్వనున్న కేంద్రం

  • జస్టిస్‌ వర్మ తొలగింపునకు మహాభియోగ తీర్మానం

  • సరళీకృత ఆదాయ పన్నుపై కొత్త బిల్లు

  • జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు సమావేశాలు

న్యూఢిల్లీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): దేశంలో లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలని నిర్ణయించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ విషయంలో జనాభా పెరుగుదలతో సంబంధం లేకుండా నిర్ణయం తీసుకునే యోచనలో ఉంది. ఈ మేరకు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో సమానంగా 20 శాతం చొప్పున లోక్‌సభ స్థానాలను పెంచాలని భావిస్తోంది. జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన జరిగితే జనాభా నియంత్రణను కట్టుదిట్టంగా అమలు చేసిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందనే ఆందోళనల నేపథ్యంలో కేంద్రం ఈ దిశగా ఆలోచిస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 1971లో జనాభా లెక్కల సేకరణ జరిగినప్పుడు దేశ జనాభా 55 కోట్లు మాత్రమే ఉండేదని, ఇప్పుడు దాదాపు 145 కోట్లకు చేరుకున్నందున లోక్‌సభ సీట్లను పెంచక తప్పదని కేంద్రం భావిస్తోంది. అయితే నియోజకవర్గాల సంఖ్యను స్తంభింపజేయాలని ప్రతిపక్షాలు చేస్తున్న డిమాండ్‌ను తిరస్కరిస్తూనే.. దక్షిణాదికి ఇబ్బంది లేకుండా అన్ని రాష్ట్రాలకు సమానంగా నియోజకవర్గాల సంఖ్యను పెంచడం సముచితమైందన్న యోచనలో ఉంది. నిజానికి దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాది జనాభా పెరిగిందని చెప్పేందుకు సాక్ష్యాధారాలేమీ లేవని, జనగణన తర్వాతే ఈ విషయంలో స్పష్టత వస్తుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. జూలై 21 నుంచి ఆగస్టు 11 వరకు జరిగే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టేందుకు మోదీ సర్కారు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే జనాభా లెక్కల సేకరణకు నోటిఫికేషన్‌ జారీ చేసిన దృష్ట్యా నియోజకవర్గాల పునర్విభజన, మహిళలకు 33 శాతం కోటాపై ఈ సమావేశాల్లో స్పష్టతనివ్వాలని భావిస్తోంది.

ఈ రెండు అంశాలను జమిలి ఎన్నికలకు ముడిపెడుతూ 2029లో దేశవ్యాప్తంగా లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన రాజ్యాంగ సవరణ బిల్లులను వర్షాకాల సమావేశాల్లోనే ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. జనగణనపై పార్లమెంటులో ప్రకటన చేసేటప్పుడే సామాజిక, ఆర్థిక వివరాలను కూడా తాము సేకరించనున్నట్లు కేంద్రం వెల్లడించే అవకాశాలున్నాయి. కాగా, వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లోనే ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ యశ్వంత్‌వర్మపై మహాభియోగ తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. దీంతోపాటు ప్రస్తుత ఆదాయ పన్ను చట్టంలోని సంక్లిష్టతలను, లొసుగులను తొలగించి సామాన్యులకు అర్థమయ్యే భాషలో కొత్త బిల్లును కూడా ఈ సమావేశాల్లోనే ప్రవేశపెట్టే అవకాశాలున్నాయని విశ్వసనీయ వర్గాలు పేర్కొన్నాయి. పహల్గామ్‌లో ఉగ్రవాదుల దాడి తర్వాత పాక్‌పై ప్రారంభించిన యుద్ధాన్ని కేవలం నాలుగు రోజుల్లోనే ముగించడంతో ఉభయసభల్లో గందరగోళం సృష్టించేందుకు ప్రతిపక్షాలు సమాయత్తమవుతున్న నేపథ్యంలో వారి దృష్టిని మళ్లించేందుకు కీలకమైన బిల్లులతో ముందుకు రావాలని మోదీ సర్కారు యోచిస్తున్నట్లు తెలిపాయి. తన నివాసంలో భారీ ఎత్తున నోట్ల కట్టలు లభ్యమైనప్పటికీ అందుకు బాధ్యత వహించేందుకు నిరాకరించిన జస్టిస్‌ యశ్వంత్‌వర్మను తొలగిస్తూ పార్లమెంటు ఉభయసభల్లో ఆయనపై మహాభియోగ తీర్మానాన్ని ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమైంది. మార్చి 14న జస్టిస్‌ వర్మ అధికార నివాసంలో అగ్నిప్రమాదం జరిగినప్పుడు భారీ ఎత్తున నోట్లకట్టలు లభ్యం కావడానికి ఆయన అనైతికచర్యలే కారణమని సుప్రీంకోర్టు నియమించిన కమిటీ తన 64 పేజీల నివేదికలో వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నివేదికను సుప్రీంకోర్టు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా మే 4న రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు, ప్రధాని మోదీకి సమర్పించారు.

సరళీకృత ఆదాయ పన్ను బిల్లు..

రానున్న పార్లమెంటు సమావేశాల్లో సరళీకృత ఆదాయ పన్ను బిల్లును కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టనున్నట్లు అధికారవర్గాలు తెలిపాయి. గత బడ్జెట్‌ సమావేశాల్లో ఆదాయ పన్ను బిల్లు- 2025 పేరిట ప్రవేశపెట్టిన బిల్లును బీజేపీ ఎంపీ బైజయంత్‌ పాండా నేతృత్వంలోని 31 మంది సభ్యుల సెలక్ట్‌ కమిటీకి నివేదించిన సంగతి తెలిసిందే. ఈ బిల్లుపై సంప్రదింపులు పూర్తి చేసిన సెలక్ట్‌ కమిటీ.. వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన మొదటిరోజునే తన నివేదికను ప్రవేశపెట్టనున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. 1961 నాటి ఆదాయపన్ను చట్టం స్థానం లో ప్రవేశపెడుతున్న కొత్త బిల్లులో అనేక కాలం చెల్లిన అంశాలను తొలగించి అందరికీ అర్థమయ్యే భాషలో స్పష్టతనిచ్చే అంశాలను చేర్చనున్నట్లు తెలిపాయి.

ఇవి కూడా చదవండి..

9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను

For International News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 04:28 AM