ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Gali Janardhan Reddy: జైలు శిక్షను సస్పెండ్‌ చేయొద్దు

ABN, Publish Date - Jun 01 , 2025 | 04:00 AM

ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది.

  • గాలి జనార్దన్‌రెడ్డి పిటిషన్‌పై సీబీఐ కౌంటర్‌

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): ఓబులాపురం మైనింగ్‌ కంపెనీ (ఓఎంసీ) కేసులో దోషిగా తేలిన మాజీ మంత్రి గాలి జనార్దన్‌రెడ్డికి ఎలాంటి ఊరట కల్పించరాదని సీబీఐ హైకోర్టును కోరింది. ఆయనకు ప్రజాసేవ చేయడం కంటే వ్యక్తిగతంగా లబ్ధిపొందడంపైనే ఎక్కువ దృష్టి ఉందని అభిప్రాయపడింది. ఓఎంసీ కేసులో సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల జైలుశిక్ష తీర్పును సస్పెండ్‌ చేయడంతోపాటు, బెయిల్‌ మంజూరు చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని గాలి జనార్దన్‌రెడ్డి సహా ఇతర ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు.


వీటిని వెకేషన్‌ కోర్టు జడ్జీలు ఎవరూ ఇంకా విచారణకు స్వీకరించలేదు. అయినప్పటికీ సీబీఐ ఆ పిటిషన్‌ను వ్యతిరేకిస్తూ కౌంటర్‌ దాఖలు చేసింది. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవచేయడం కంటే వ్యక్తిగతంగా లబ్ధిపొందడంపైనే ఆయన దృష్టి ఉన్నట్టు కనిపిస్తోందని పేర్కొంది. ఆయనకు ఎలాంటి ఊరట కల్పించరాదని హైకోర్టుకు సీబీఐ విజ్ఞప్తి చేసింది.

Updated Date - Jun 01 , 2025 | 04:00 AM