ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bus Accident: ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు

ABN, Publish Date - Jun 05 , 2025 | 04:06 AM

డివైడర్‌ పక్కన ఆగివున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ఆ బస్సు డ్రైవర్‌, ఓ ప్రయాణికురాలు దుర్మరణంపాలయ్యారు. 16 మందికి గాయాలయ్యాయి.

  • బస్సు డ్రైవర్‌, ప్రయాణికురాలి మృతి

  • 16 మందికి గాయాలు

చౌటుప్పల్‌ రూరల్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): డివైడర్‌ పక్కన ఆగివున్న లారీని ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టడంతో ఆ బస్సు డ్రైవర్‌, ఓ ప్రయాణికురాలు దుర్మరణంపాలయ్యారు. 16 మందికి గాయాలయ్యాయి. యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌ మండలం ఖైతాపురం వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఏపీలోని ప్రకాశం జిల్లా కందుకూరు నుంచి ఓ ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సు మంగళవారం రాత్రి 40 మంది ప్రయాణికులతో హైదరాబాద్‌కు బయలుదేరింది. బుధవారం తెల్లవారుజామున చౌటుప్పల్‌ మం డలం ఖైతాపురం వద్ద డివైడర్‌ పక్కన ఆగివున్న లారీని డ్రైవర్‌ గమనించకపోవడంతో బస్సు ఢీకొట్టింది.


బస్సు డ్రైవర్‌, ప్రకాశం జిల్లా జరుగుమల్ల మండలం చిర్రికుర్రపాడుకు చెందిన మేడుబల్మి కొండల్‌రావు(41), ప్రకాశం జిల్లా కొన్నూ రు మండలం పర్రిచూరివారిపాలెం గ్రామానికి చెందిన ప్రయాణికురాలు దండెబోయిన గోవిందమ్మ(47) అక్కడికక్కడే మృతి చెందారు. వీరితోపాటు మరో 16మంది ప్రయాణికులు గాయపడ్డారు. వీరిని హైదరాబాద్‌, చౌటుప్పల్‌ ఆస్పత్రులకు తరలించారు.

Updated Date - Jun 05 , 2025 | 04:06 AM