ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

BRS: కేసీఆర్‌ ఫాంహౌస్‌‌‌లో జారిపడ్డ పల్లా

ABN, Publish Date - Jun 12 , 2025 | 04:17 AM

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయపడ్డారు. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు.

  • విరిగిన ఎడమ తుంటి.. యశోద ఆస్పత్రిలో శస్త్రచికిత్స

  • పరామర్శించిన కేసీఆర్‌

హైదరాబాద్‌ సిటీ/జనగామ, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి గాయపడ్డారు. బుధవారం ఉదయం సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని కేసీఆర్‌ ఫాంహౌ్‌సలో బాత్‌రూమ్‌లో కాలుజారి పడ్డారు. దీంతో ఆయన తుంటికి బలమైన గాయమైంది. వెంటనే చికిత్స కోసం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. పరీక్షలు చేసిన వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించి సాయంత్రం ఆపరేషన్‌ చేశారు.

పల్లాకు ఆరు వారాలపాటు విశ్రాంతి అవసరమని సూచించారు. కాగా, బుధవారం కాళేశ్వరం కమిషన్‌ ఎదుట విచారణకు హాజరైన కేసీఆర్‌.. అనంతరం యశోద ఆస్పత్రికి వెళ్లి రాజేశ్వర్‌రెడ్డిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కేసీఆర్‌ వెంట హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, సంతో్‌షకుమార్‌ ఉన్నారు.

Updated Date - Jun 12 , 2025 | 04:17 AM