ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Toll Plazas: ఔటర్‌పై టోల్‌ బూస్టర్‌ లేన్లు

ABN, Publish Date - Jun 22 , 2025 | 04:34 AM

ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ ప్లాజాల వద్ద బూస్టర్‌ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్టాగ్‌ను సెకన్లలో రీడింగ్‌ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు.

  • నిమిషానికి 15కు పైగా వాహనాలు

  • గేటు తెరిచే ఉంటుంది.. ఫాస్టాగ్‌ రీడ్‌ అవుతుంది

  • ప్రయోగాత్మకంగా నానక్‌రాంగూడ-శంషాబాద్‌ మార్గంలో..

  • సత్ఫలితాలతో రద్దీ ప్రాంతాల్లో అమలుకు చర్యలు

  • కొత్త టెక్నాలజీతో.. పాత ఆర్‌ఎ్‌ఫఐడీ విధానం అప్‌గ్రేడ్‌

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 21 (ఆంధ్రజ్యోతి): ఔటర్‌ రింగ్‌ రోడ్డు(ఓఆర్‌ఆర్‌)పై టోల్‌ ప్లాజాల వద్ద బూస్టర్‌ లేన్లు అందుబాటులోకి వచ్చాయి. ఫాస్టాగ్‌ను సెకన్లలో రీడింగ్‌ చేసే సరికొత్త సాంకేతిక వ్యవస్థను ఈ లేన్లలో ఏర్పాటు చేశారు. దాంతో ఈ లేన్‌లో వాహనాలను నిలిపే పరిస్థితి ఉండదు. బారికేడ్లు తెరిచి ఉండగానే.. ఫాస్టాగ్‌ రీడ్‌ అవుతుంది. దీంతో.. ఎలాంటి అడ్డంకుల్లేకుండా వాహనాలు సాఫీగా ముందుకు సాగుతున్నాయి. నానక్‌రాంగూడ-శంషాబాద్‌ మార్గంలో ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఈ విధానం సత్ఫలితాలనిస్తోందని అధికారులు చెబుతున్నారు. నిమిషానికి సగటున 15 వాహనాలు బూస్టర్‌ లేన్ల ద్వారా ముందుకు సాగుతున్నట్లు వెల్లడించారు. పైలట్‌ ప్రాజెక్టు విజయవంతమవ్వడంతో.. రద్దీ ఎక్కువగా ఉండే టోల్‌ప్లాజాల వద్ద ఈ విధానాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

రద్దీ వేళల్లో టోల్‌ వద్దే ఆలస్యం!

నగరంలో నత్తను తలపించే వేగాన్ని తప్పించుకునేందుకు వాహనదారులు ఎక్కువగా ఔటర్‌ను ఆశ్రయిస్తుంటారు. దూరాభారమైనా.. ప్రయాణం సాఫీగా సాగిపోతుందనే ఉద్దేశంతో ఔటర్‌పై ప్రయాణానికి ఇష్టపడుతుంటారు. అయితే.. ఔటర్‌పైకి వెళ్లే ముందు.. దిగే ముందు టోల్‌ప్లాజాల వద్ద ట్రాఫిక్‌ జామ్‌లు నెలకొంటున్నాయి. టోల్‌ దాటేందుకు నాలుగైదు నిమిషాల సమయం పడుతోంది. ఉదయం, సాయంత్రం రద్దీ వేళల్లో పరిస్థితి మరీ దారుణంగా మారుతోంది. టోల్‌గేట్‌ వద్ద ఫాస్టాగ్‌ రీడ్‌ అయ్యి, గేటు ఓపెన్‌ కావడానికి.. వాహనం గేటును దాటడానికి సగటున 20 సెకన్ల సమయం పడుతోంది. ఈ లెక్కన నిమిషానికి మూడు వాహనాలు మాత్రమే టోల్‌గేట్‌ను దాటుతాయి. ప్రధానంగా నానక్‌రాంగూడ-శంషాబాద్‌ మార్గంలో టోల్‌ వద్ద ట్రాఫిక్‌ తీవ్రంగా ఉంటోంది. దీంతో అధికారులు ఈ మార్గంలో పైలట్‌ ప్రాజెక్టుగా బూస్టర్‌ లేన్‌ విధానాన్ని తీసుకువచ్చారు. మూడు గ్టేలను బూస్టర్‌ లేన్‌కు కేటాయించారు. భారీ వాహనాలు, ఫాస్టాగ్‌ లేని కార్లకు ఈ లేన్‌లో అనుమతి ఉండదు. టోల్‌గేట్‌కు ఉండే ఫాస్టాగ్‌ రీడర్‌ను అధునాతన సాంకేతికతతో అభివృద్ధి చేశారు. ఏడేళ్ల క్రితం ప్రవేశపెట్టిన(పాత) ఆర్‌ఎ్‌ఫఐడీ రీడర్లను అప్‌గ్రేడ్‌ చేశారు. దీంతో.. గేట్‌ పడి.. ఫాస్టాగ్‌ రీడ్‌ అయ్యేదాకా ఎదురుచూడాల్సిన అవసరం ఉండదు. గేటు తెరిచే ఉంటుంది. వాహనం కదులుతుండగానే మూడు/నాలుగు సెకన్లలోనే ఫాస్టాగ్‌ రీడ్‌ అవుతుంది. దీంతో.. వాహనం ఆగకుండా ముందుకు కదులుతుంది. ఇలా నిమిషానికి 15 వాహనాలు నిర్విరామంగా ముందుకు సాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇతర ప్రాంతాల్లోనూ అమలు

నానక్‌రాంగూడ-శంషాబాద్‌ మార్గంలో బూస్టర్‌ లేన్‌ విధానం విజయవంతమవ్వడంతో.. రద్దీ ఎక్కువగా ఉండే ఇతర ప్రాంతాల్లోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. నానక్‌రాంగూడలో మూడు ఎంట్రీ, మూడు ఎగ్జిట్లలో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. శంషాబాద్‌లోనూ ఎంటీ, ఎగ్జిట్లలో రెండేసి, పోలీసు అకాడమీ జంక్షన్‌ వద్ద ఒకటి చొప్పున బూస్టర్‌ లేన్లు ఉన్నాయి. రద్దీ అధికంగా ఉండే పెద్దఅంబర్‌పేట్‌, శామీర్‌పేట్‌, పటాన్‌చెరు, మేడ్చల్‌ ఇంటర్‌చేంజ్‌ల వద్ద కూడా బూస్టర్‌ లేన్లను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

9వ రోజు కొనసాగుతున్న ఇజ్రాయెల్-ఇరాన్ వార్..దౌత్యం ఎప్పుడు

భారత్-పాక్ యుద్ధాన్ని ఆపినందుకు నోబెల్ బహుమతి పొందలేను

For International News And Telugu News

Updated Date - Jun 22 , 2025 | 04:34 AM