Ramchander Rao: సుప్రీం తీర్పును స్వాగతిస్తున్నాం
ABN, Publish Date - Aug 01 , 2025 | 03:59 AM
ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు
హైదరాబాద్, జూలై 31 (ఆంధ్రజ్యోతి): ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు అన్నారు. మూడు నెలల్లోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని చెప్పడం మంచి పరిణామమని వ్యాఖ్యానించారు. కోర్టు తీర్పునకు అనుగుణంగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేలా స్పీకర్ వ్యవహరించాలని కోరారు. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలో మార్పులు చేసినా, అందులోని లోపాలను ఆసరాగా చేసుకుని విపక్ష ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఫిరాయింపులకు ప్రోత్సహిస్తోందని విమర్శించారు. గతంలో బీఆర్‌ఎస్ కూడా ఇదే పాపం చేసిందని మండిపడ్డారు. కాగా, కాంగ్రెస్ చేపట్టిన ‘జనహిత పాదయాత్ర’ జనాలను మోసం చేసే పాదయాత్ర అని రాంచందర్‌రావు విమర్శించారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు, డిక్లరేషన్లు ఎంత వరకు అమలు చేశారో శ్వేతపత్రం ప్రకటించి పాదయాత్ర చేయాలన్నారు. ఇక, మాలేగావ్‌లో 2008లో జరిగిన పేలుళ్ల కేసులో కుట్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏడుగురిని ముంబై ఎన్‌ఐఏ కోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని స్వాగతిస్తున్నామని రాంచందర్‌రావు తెలిపారు. కాగా, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రజాస్వామ్యానికి స్ఫూర్తిదాయకమని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి అన్నారు. అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్పీకర్ అమలు చేస్తారన్న నమ్మకం తనకు ఉందని ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి..
జగన్ పర్యటన.. ప్రశాంతి రెడ్డి రియాక్షన్
జగన్ జైలుకు వెళ్తారా అంటే.. లోకేష్ ఏమన్నారంటే..
For More Telangana News And Telugu News
Updated Date - Aug 01 , 2025 | 03:59 AM