ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

లైఫ్ స్టైల్+ -

వెబ్ స్టోరీస్+ -

Bhatti Vikramarka: అన్ని రంగాలకు నాణ్యమైన విద్యుత్‌

ABN, Publish Date - May 10 , 2025 | 05:10 AM

రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్నిరంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు.

  • ‘రాజీవ్‌ యువ వికాసం’ లబ్ధిదారుల ఎంపికను పూర్తి చేయండి: భట్టి

హైదరాబాద్‌, మే 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్‌ అవసరాలను దృష్టిలో పెట్టుకొని అన్నిరంగాలకు నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. దీనికోసం ఐదేళ్ల కాలానికి కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, అమలు చేయాలని అధశికారులకు సూచించారు. శుక్రవారం ఐదేళ్ల విద్యుత్‌ ప్రణాళికపై ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో అంతర్జాతీయ టెక్నాలజీ, ఫార్మా, మాన్యుఫ్యాక్చరింగ్‌ సంస్థలు పెట్టుబడులతో తమ కార్యకలాపాలు విస్తరిస్తున్నాయని, దీనివల్ల అంచనాలకు మించి విద్యుత్‌ డిమాండ్‌ నెలకొంటుందన్నారు. మరోవైపు.. ముందుగా నిర్దేశించుకున్న క్యాలెండర్‌ ప్రకారంగా రాజీవ్‌ యువ వికాసం లబ్థిదారులను ఎంపిక చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్‌ 2న రుణ మంజూరు పత్రాల అందజేతకు తగిన చర్యలు తీసుకోవాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.


రాజీవ్‌ యువ వికాసం పథకంపై సచివాలయంలో సంబంధిత అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. కాగా, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 21 వరకు కాళేశ్వరంలో నిర్వహిస్తున్న సరస్వతీ పుష్కరాలకు కుటుంబ సమేతంగా హాజరు కావాలని డిప్యూటీ సీఎంనును దేవాదాయ శాఖ ముఖ్యకార్యదర్శి శైలజారామయ్యర్‌, కమిషనర్‌ వెంకట్రావు ఆహ్వానించారు. ఇదిలా ఉండగా, ఇదిలా ఉండగా, బొగ్గు ఉత్పత్తిలో అగ్రస్థానంలో ఉన్న సింగరేణి రానున్న రోజుల్లో కీలక ఖనిజాల అన్వేషణ, సంప్రదాయేతర ఇంధన వనరుల రంగంలో ప్రవేశించి తన సత్తాను చాటాలని భట్టివిక్రమార్క అన్నారు. సచివాలయంలో సింగరేణి భవిష్యత్తు విస్తరణ ప్రాజెక్టులపై ఆయన సమీక్ష నిర్వహించారు.


ఇవి కూడా చదవండి

Operation Sindoor: సోషల్ మీడియాలో పాక్ తప్పుడు ప్రచారం.. వాస్తవాలు బయటపెట్టిన PIB

PIB Fact Check: 3 రోజుల పాటు ATMలు బంద్.. వైరల్ పోస్టుపై పీఐబీ ఫ్యాక్ట్ చెక్..

Read Latest Telangana News And Telugu News

Updated Date - May 10 , 2025 | 05:10 AM