Bandi Sanjay: పథకాల పేరు మార్పు సిగ్గుచేటు: బండి సంజయ్
ABN, Publish Date - Jun 28 , 2025 | 04:39 AM
హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేర్లను మారుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు.
హైదరాబాద్, జూన్ 27 (ఆంధ్రజ్యోతి): హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం పథకాల పేర్లను మారుస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. ‘అన్నపూర్ణ’ పేరిట అందిస్తున్న రూ.5భోజనం పథకానికి ఇందిరాగాంధీ పేరు పెట్టడం సిగ్గుచేటని ‘ఎక్స్’ వేదికగా ధ్వజమెత్తారు.
మార్పు తీసుకొస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్.. ఆయా కార్యక్రమాల పేర్లలో మాత్రమే మార్పు తీసుకువచ్చిందని విమర్శించారు. కాగా, యూరియా బస్తాకు రూ.25చొప్పున రవాణా ఖర్చును రైతులపై వేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని బీజేపీ అధికార ప్రతినిధి రాణిరుద్రమ డిమాండ్ చేశారు
Updated Date - Jun 28 , 2025 | 04:39 AM