Attack on Salon: సెలూన్ ఎలా పెడతావని నాయీ బ్రాహ్మణేతరుడిపై దాడి
ABN, Publish Date - Jul 16 , 2025 | 03:24 AM
నాయీ బ్రాహ్మణుడివి కాకుండా సెలూన్ ఎలా పెడతావు అంటూ కొందరు తనపై దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు.
హైకోర్టుకు బాధితుడు..రక్షణ కల్పించాలని ఆదేశాలు
హైదరాబాద్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ‘నాయీ బ్రాహ్మణుడివి కాకుండా సెలూన్ ఎలా పెడతావు?’ అంటూ కొందరు తనపై దాడి చేశారని, పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. దీనిపై స్పందించిన న్యాయస్థానం.. పిటిషనర్‌కు రక్షణ కల్పించాలని పోలీసులను ఆదేశించింది. వికారాబాద్ డైట్ కాలేజీ రోడ్డులో ఫెరోజ్ ఖాన్ అనే వ్యక్తి ‘ప్రిన్స్ మెన్స్ అండ్ వుమెన్స్ పార్లర్’ పేరుతో సెలూన్ షాప్ నడుపుతున్నాడు. గత నెల 21న రమేశ్ అనే వ్యక్తితో పాటు దాదాపు 70 మంది ఆ షాప్ దగ్గరకు వచ్చి ‘నాయీ బ్రాహ్మణుడివి కాకుండా సెలూన్ షాప్ ఎలా పెడతావు’? అంటూ దూషిస్తూ దాడి చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించిన ఫెరోజ్ ఖాన్.. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇరువైపులా వాదనలు విన్న జస్టిస్ టి.వినోద్‌కుమార్ ధర్మాసనం.. దర్యాప్తు చేపట్టి నిందితులపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది.
Updated Date - Jul 16 , 2025 | 03:27 AM