School Holidays: వరుసగా రెండు రోజులు స్కూళ్లకు సెలవులు.. అసలు కారణమిదే..
ABN, Publish Date - Feb 07 , 2025 | 09:33 AM
School Holidays: ఏపీ, తెలంగాణలో రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరుకుతున్నాయి. వరుస సెలవులకు కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం..
హైదరాబాద్: వరుసగా రెండు రోజుల పాటు స్కూళ్లకు సెలవులు రానున్నాయి. ఇప్పటికే విద్యార్థులకు జనవరిలో భారీగా సెలవులు వచ్చాయి. నూతన సంవత్సరం, సంక్రాంతి పండుగలకు సెలవులు దొరకడంతో విద్యార్థులు సందడిగా గడిపారు. అయితే వార్షిక పరీక్షలు దగ్గర పడుతుండటంతో ప్రిపరేషన్‌తో బిజీ అయిపోయారు స్టూడెంట్స్. అయితే ఫిబ్రవరిలో మరో రెండు రోజుల పాటు సెలవులు రానున్నాయి. ఇప్పటికే నాలుగు ఆదివారాలు రాగా మరో రెండు రోజులు కూడా సెలవు దొరకనున్నాయి. 4 ఆదివారాలతో పాటు శివరాత్రి పండుగ కూడా ఈ నెలలోనే వచ్చింది. వీటికి తోడు అదనంగా మరో రోజు కూడా సెలవు దొరకనుంది.
హాలీడేకు రీజన్ ఇదే..
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ఆయా స్థానాలకు నోటిఫికేషన్ వెలువడిన విషయం తెలిసిందే. ఇందుకుగానూ నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. ఫిబ్రవరి 27న గ్రాడ్యుయేట్‌తో పాటు టీచర్ ఎమ్మెల్సీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ఈ దృష్ట్యా పాఠశాలలకు సెలవు ఇవ్వనున్నారని తెలుస్తోంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్స్, స్కూల్ టీచర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. కాగా, గతంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు రెండు ప్రభుత్వాలు సెలవు ప్రకటించిన విషయం విదితమే. దీంతో ఈ నెల 27న కూడా సెలవు మంజూరు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 26న శివరాత్రి పండుగ రావడంతో ఆ రోజు పబ్లిక్ హాలీడే ఇస్తారు. దీంతో ఈ నెలలో ఆదివారాలతో పాటు మరో రెండు రోజుల సెలవులు కలిపి మొత్తం ఆరో రోజుల పాటు విద్యార్థులకు సెలవులు వచ్చినట్లు అవుతుంది.
ఏపీలోనూ ఎన్నికలు!
తెలంగాణతో పాటు ఏపీలో శివరాత్రి పర్వదినం తర్వాత రెండు రాష్ట్రాల్లో ఒకేరోజు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. మెదక్-నిజామాబాద్-కరీంనగర్-ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలతో పాటు వరంగల్-ఖమ్మం-నల్గొండ టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాలకు ఎన్నికలు నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు గ్రాడ్యుయేట్ స్థానాలకు ఎన్నిక జరగనుంది. అలాగే విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం స్థానాల్లోనూ ఎలక్షన్స్ నిర్వహిస్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
Sailajanath.. వైఎస్సార్‌సీపీలో చేరనున్న మాజీ మంత్రి...
RGV: పోలీస్ విచారణకు రాంగోపాల్ వర్మ
Musical Show : సమాజం కోసం మనం సైతం!
Read Latest AP News and Telugu News
Updated Date - Feb 07 , 2025 | 11:22 AM