Anchor Swetcha : యాంకర్ స్వేచ్ఛ సూసైడ్‌పై పూర్ణచందర్ భార్య షాకింగ్ కామెంట్స్..
ABN, Publish Date - Jun 30 , 2025 | 08:47 AM
ప్రముఖ టీవీ చానల్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చారు.
Anchor Swetcha Votarkar Case: ప్రముఖ టీవీ చానల్ న్యూస్ యాంకర్ స్వేచ్ఛ వొటార్కర్ (40) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే, ఈ కేసులో నిందితుడు పూర్ణచందర్ భార్య స్వప్న తెరపైకి వచ్చారు. పూర్ణ చందర్ ద్వారానే స్వేచ్ఛ తనకు పరిచయం అయిందన్నారు. అయితే, వారిద్దరి మధ్య సంబంధం గురించి ముందు తనకు తెలియదన్నారు. వారిద్దరి వ్యవహారం తెలిశాక పూర్ణను వదిలేశానని పేర్కొన్నారు.
పూర్ణచందర్‌పై స్వేచ్ఛ కూతురు అరణ్య చేస్తున్న ఆరోపణలు అసత్యమని, అరణ్యను పూర్ణచందర్ సొంత కూతురిలా చూసుకున్నాడని స్వప్న వ్యాఖ్యానించారు. స్వేచ్ఛ నన్ను మానసికంగా టార్చర్ చేసిందని, స్వేచ్ఛ పూర్ణచందర్‌ను బ్లాక్‌మెయిల్ చేసిందని స్వప్న షాకింగ్ కామెంట్స్ చేశారు. నా పిల్లలను కూడా అమ్మా అని పిలవాలని బయపెట్టిందని స్వప్న వివరించారు. నా భర్త పూర్ణచందర్ నిర్దోషి, అమాయకుడని స్వప్న సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, స్వేచ్ఛ వోటార్కర్ ఆత్మహత్య కేసులో పూర్ణచందర్‌ను పోలీసులు నిన్న అరెస్ట్ చేశారు. అతడి వేధింపుల కారణంగానే తమ కూతురు మరణించినట్టు చిక్కడపల్లి పోలీసులకు స్వేచ్ఛ తండ్రి ఫిర్యాదు చేయడంతో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే, ఈ నేపథ్యంలోనే నిందితుడు పూర్ణచందర్ రాసిన లేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. స్వేచ్ఛ, నేను స్నేహితులుగా ఉండేవాళ్లం. ఐదేళ్లుగా ఆమె మానసికంగా ఆందోళన చెందుతూ చికిత్స పొందుతుంది. ఇందుకు సంబంధించిన ఆధారాలు నా వద్ద ఉన్నాయి. స్వేచ్ఛ ఆత్మహత్యతో నాకు ఏలాంటి సంబంధం లేదని లేఖలో పూర్ణచందర్ పేర్కొన్నారు.
Also Read:
మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
మైనంపల్లి సంచలన కామెంట్స్.. భార్యాభర్తల ఏకాంత సంభాషణనూ ట్యాప్ చేశారు
For More Telugu News
Updated Date - Jun 30 , 2025 | 01:56 PM