HYDRA: మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమణలను తొలగిస్తున్న హైడ్రా
ABN , Publish Date - Jun 30 , 2025 | 08:12 AM
HYDRA: హైదరాబాద్, మాదాపూర్ సున్నం చెరువు వద్ద ఆక్రమ నిర్మాణాలను సోమవారం ఉదయం నుంచి హైడ్రా అధికారులు కూల్చివేస్తున్నారు. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను కూడా అధికారులు తొలగిస్తున్నారు.
Hyderabad: మాదాపూర్ (Madhapur) సున్నం చెరువు (Sunnan Cheruvu) వద్ద ఆక్రమణలను (Illegal encroachments) సోమవారం ఉదయం హైడ్రా (HYDRA) అధికారులు తొలగిస్తున్నారు (Demolition). ఎఫ్‌టిఎల్ పరిధిలో చెరువు సమీపంలో అక్రమంగా నిర్మించిన గుడిసెలను తొలగిస్తున్నారు. చెరువులు పునరుద్ధరణలో భాగంగా 10 కోట్ల రూపాయలతో హైడ్రా అధికారులు సున్నం చెరువును అభివృద్ధి చేస్తున్నారు. 32 ఎకరాల విస్తీర్ణంలోని సున్నం చెరువులో భారీగా ఆక్రమణలు జరిగాయి. చెరువు సమీపంలో అక్రమంగా వేసిన బోరు మోటార్లను కూడా అధికారులు తొలగిస్తున్నారు. సున్నం చెరువు సమీపంలో ఏళ్ల తరబడి జోరుగా అక్రమ నీటి వ్యాపారం జరుగుతోంది. ఇటీవల సున్నం చెరువు పరిధిలోని భూగర్భ జలాలను వినియోగించవద్దని హైడ్రా అధికారులు సూచించిన విషయం తెలిసిందే.
కాగా మూడు వారాల క్రితం రసూల్‌పురా సెంటర్‌లోని ప్యాట్నీ నాలాను ఆనుకుని నిర్మించిన ఆక్రమణలను హైడ్రా అధికారులు కూల్చివేశారు. సుమారు 150 మీటర్ల మేర ఉన్న మూడు భవనాలను కూలగొట్టారు. ప్యాట్నీ వద్ద ఆక్రమణలతో 15 నుంచి 18 అడుగులకు నాలా కుంచించుకుపోయింది. దీంతో వర్షాలు కురిసినప్పుడు నీరంతా రోడ్లపైకి చేరుతోంది. 2.5 సెంటిమీటర్ల వాన పడితే చాలు కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. పాయిగ కాలనీ, ప్యాట్నీ కాంపౌండ్, ప్యాట్నీ కాలనీ, విమాననగర్, బీహెచ్ఈఎల్ కాలనీ, ఇందిరమ్మ నగర్‌లు మునిగిపోతున్నాయి. దీర్ఘ కాలంగా ఈ సమస్య కొనసాగుతోంది. అయితే కోర్టు కేసులు ఉండడంతో అధికారులు చర్యలు తీసుకోలేకపోయారు. ఇటీవల ఈ సమస్య తీవ్రం కావడంతో ఆయా కాలనీలవాసులు హైడ్రాకు ఫిర్యాదు చేశారు.
దీనిపై స్పందించిన హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్, కంటోన్‌మెంట్ బోర్డు, జీహెచ్ఎంసీ, రెవెన్యూ, నీటిపారుదల, ఇతర శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి నిర్మాణాలు చేపడితే నోటీసులు ఇవ్వకుండా కూల్చేయవచ్చని ‘బుల్డోజర్’ కేసులో సుప్రీం తీర్పు ఉండడంతో దాన్ని అధికారులు అమలు చేశారు. త్వరలో రిటైనింగ్ వాల్నిర్మించడంతో పాటు నాలా విస్తరణ పనులు మొదలుపెట్టనున్నారు.
ఇవి కూడా చదవండి:
సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటమ్ వాలీపై వర్క్‌షాపు
కళ్లలో కారం కొట్టి పీకపై కాలేసి తొక్కి..
జైళ్లలో ఉండాల్సినవారు చట్టసభల్లో ఉంటున్నారు
For More AP News and Telugu News