Share News

Karnataka: కళ్లలో కారం కొట్టి పీకపై కాలేసి తొక్కి భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

ABN , Publish Date - Jun 30 , 2025 | 05:34 AM

భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కడశెట్టిహళ్లిలో..

Karnataka: కళ్లలో కారం కొట్టి పీకపై కాలేసి తొక్కి భర్తను దారుణంగా హత్య చేసిన భార్య

  • వివాహేతర బంధానికి అడ్డొస్తున్నాడని ఘాతుకం

  • కర్ణాటకలోని కడశెట్టిహళ్లిలో ఘటన

బెంగళూరు, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): భార్య చేతిలో మరో భర్త బలయ్యాడు. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తుమకూరు జిల్లా తిపటూరు తాలూకా కడశెట్టిహళ్లిలో.. కళ్లలో కారం చల్లి గొంతు తొక్కి భర్తను దారుణంగా హత్య చేసిందో ఇల్లాలు. కొద్దిరోజుల క్రితం జరిగిన ఈ దారుణం శనివారం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల కథనం మేరకు శంకరమూర్తి (50), సుమంగళ దంపతులు కడశెట్టిహళ్లి గ్రామశివారులోని ఓ ఫాంహౌ్‌సలో నివసించేవారు. సుమంగళ తిపటూరులోని కల్పతరు బాలికల హాస్టల్‌లో వంటమనిషిగా పనిచేస్తోంది. కొంతకాలంగా ఇదే గ్రామానికి చెందిన నాగరాజుతో ఆమెకు వివాహేతర సంబంధం ఏర్పడింది. అందుకు భర్త అడ్డుగా ఉన్నాడని అతడిని తొలగించుకోదలిచింది. ఈ క్రమంలో ఈ నెల 24న ఇంట్లోనే భర్త కళ్లలోకి కారప్పొడి చల్లడంతో అతడు కిందపడిపోయాడు. ఆ తర్వాత ఓ పెద్ద కర్రతో దాడి చేసి, భర్త గొంతుపై కాలేసి బలంగా తొక్కి హత్యచేసింది.


ఆ తర్వాత మృతదేహాన్ని ప్రియుడి సాయంతో ఓ సంచిలో కుక్కి 30 కిలోమీటర్ల దూరంలోని ఓ బావిలో పడేసింది. ఆ తర్వాత శంకరమూర్తి కనిపించడం లేదని ఆమె నొనవినకెరె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. పోలీసులు వారి ఇంటిని పరిశీలించగా శంకరమూర్తి నిద్రించే గదిలో కారప్పొడి చల్లిన ఆనవాళ్లు గుర్తించారు. ఆమె మొబైల్‌ కాల్‌డేటాను పరిశీలించగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. విచారణలో హత్యచేసినట్లు ఆమె అంగీకరించడంతో అరెస్టు చేశారు.

Also Read:

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

For More Telugu News

Updated Date - Jun 30 , 2025 | 06:04 AM