Share News

Surada Prasad: యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..

ABN , Publish Date - Jun 29 , 2025 | 04:22 PM

యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి చెందిన రచయిత ప్రసాద్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు.

Surada Prasad: యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు సీఎం చంద్రబాబు అభినందనలు..
Surada Prasad And Chandrababu

Surada Prasad: యువ రచయిత సూరాడ ప్రసాద్‌కు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ సోషల్ మీడియాలో అభినందనలు తెలిపారు. విశాఖ జిల్లా మత్స్యకార గ్రామానికి చెందిన రచయిత ప్రసాద్ యువతకు స్ఫూర్తిగా నిలిచారని కొనియాడారు. తెలుగు సాహిత్యంలో యువ రచయిత సూరాడ ప్రసాద్ ప్రతిష్ఠాత్మక పురస్కారం గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆయన రచించిన ‘మైరావణ’ నవలకు గాను కేంద్ర సాహిత్య యువ పురస్కారం దక్కింది.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సోషల్ మీడియాలో స్పందించారు. పేద మత్స్యకార కుటుంబంలో పుట్టి సాహిత్యంపై మక్కువతో రాసిన రెండో నవలకే ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకోవడం ఎంతో ఆనందదాయకమన్నారు. ఇంతటి అద్భుత ప్రతిభ కనబరిచిన ప్రసాద్ సూరి (సూరాడ ప్రసాద్) కి అభినందనలు తెలిపారు. సముద్రపు లోతు చూసే మత్స్యకారులకు మనిషి జీవితపు ఎత్తుపల్లాలు చూడడం కష్టమేమీ కాదు అని నిరూపించిన ప్రసాద్ సూరి రానున్న రోజుల్లో సాహిత్యపు శిఖరం తాకాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానని ఆకాంక్షించారు. రాష్ట్రానికి, తాను జన్మించిన జాతికి ఎనలేని ప్రతిష్ట తెచ్చిపెట్టిన ప్రసాద్ సూరికి మరోసారి శుభాభినందనలు తెలిపారు.


అలాగే విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ సైతం యువ రచయితకు అభినందనలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో స్పందిస్తూ..'మైరావణ' నవలకు గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య యువ పురస్కారం అందుకున్న యువ రచయిత సూరాడ ప్రసాద్ కి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు . విశాఖ జిల్లా రాంబిల్లి మండలం వాడరాంబిల్లికి చెందిన ప్రసాద్ .. తెలుగు సాహిత్యంపై మక్కువతో అద్భుతమైన రచనలు రాశారని, తన రెండో నవలకే ప్రతిష్టాత్మక పురస్కారం అందుకోవడం ప్రశంసనీయమని కొనియాడారు. మత్స్యకార గ్రామం నుంచి ఎదిగిన ప్రసాద్ తన నవలా రచనలతో యువతకు ఎంతో స్ఫూర్తిగా నిలిచారని ప్రశంసించారు. భవిష్యత్‌లో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకుంటున్నానన్నారు.


Also Read:

నా శత్రువు పెద్దారెడ్డి మాత్రమే...

కమల్ హాసన్‌కు హృదయపూర్వక అభినందనలు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..

For More Telugu News

Updated Date - Jun 29 , 2025 | 04:53 PM