అక్షయపాత్ర ఫౌండేషన్‌కు చేయూత
ABN, Publish Date - Apr 26 , 2025 | 04:14 AM
వంటగది పరికరాలు, భోజనం సరఫరా చేసేందుకు ఎలక్రిక్ వాహనాలకు సుమారు రూ.88 లక్షలు హడ్కో ఆర్థిక సాయం అందించింది.
భోజనం సరఫరాకు వాహనాల అందజేత
హైదరాబాద్, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): అక్షయపాత్ర ఫౌండేషన్‌కు హౌసింగ్ అండ్ అర్బన్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్ లిమిటెడ్(హడ్కో), ఫ్రాంక్లిన్ టెంప్లేటోన్ సర్వీసె్‌స(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ చేయూత అందించాయి. వంటగది పరికరాలు, భోజనం సరఫరా చేసేందుకు ఎలక్రిక్ వాహనాలకు సుమారు రూ.88 లక్షలు హడ్కో ఆర్థిక సాయం అందించింది.
ఫ్రాంక్లిన్ టెంప్లేటోన్ సర్వీసెస్ మధ్యాహ్న భోజన సరఫరా వాహనాన్ని ఇచ్చింది. ఈ రెండు సంస్థల సహకారంతో తాము ఎక్కువ మంది విద్యార్థుల వద్దకు ఆహారాన్ని చేర్చగలుగుతామని అక్షయపాత్ర ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రీసత్యగౌరచంద్ర దాస తెలిపారు.
Updated Date - Apr 26 , 2025 | 04:22 AM